Tuesday, May 7, 2024

తమిళనాడు@411

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్ కేసులన్నీ తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారివేనని పేర్కొంది. ఒడిశాలోని కటక్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైందని, తబ్లిగీ జమాత్‌కు వెళ్లివచ్చిన వ్యక్తికి కరోనా వచ్చిందని తెలిపింది. తబ్లిగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. తమిళనాడు ఒక్క రోజులోనే 102 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒక్క రోజే 91 కేసు నమోదు కావడంతో 384 కు చేరుకుంది. భారత్ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2858 చేరుకోగా 75 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో 154, ఎపిలో 161 కేసులు నమోదయ్యాయి.  ప్రపంచంలో కరోనా వైరస్ 10,30,654 మందికి సోకగా 54,231 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 2,20,011 మంది కోలుకున్నారు. చైనాలో కరోనా 81,620 మందికి సోకగా 3322 మంది చనిపోయారు. చైనాలో కరోనా నుంచి 76,571 మంది కోలుకున్నారు. చైనాలో ప్రస్తుతం 1727 మంది చికిత్స పొందుతున్నారు.

 

Corona patient increased in India

 

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
కరోనా రోగుల సంఖ్య
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 423 42 21
తమిళనాడు 411 6 1
ఢిల్లీ 384 8 4
కేరళ 286 28 2
యుపి 172 17 2
రాజస్థాన్ 166 3
ఆంధ్రప్రదేశ్ 161 2 1
తెలంగాణ 154 17 9
కర్నాటక 125 11 3
మధ్య ప్రదేశ్ 107 8
గుజరాత్ 95 10 8
జమ్ము కశ్మీర్ 75 3 2
హర్యానా 57 27
పశ్చిమ బెంగాల్ 53 3 6
పంజాబ్ 51 1 5
బిహార్ 29 3 1
అస్సాం 20
ఛండీగఢ్ 18
లడఖ్ 13 3
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 10
ఉత్తరాఖండ్ 10 2
ఛత్తీసఘఢ్ 9 3
గోవా 6
హిమాచల్ ప్రదేశ్ 6 1 2
ఒడిశా 6 2
పుదుచ్చేరీ 5
జార్ఖండ్ 2
మణిపూర్ 2
అరుణాచల్ ప్రదేశ్ 1
మిజోరాం 1
మొత్తం 2858 192 75
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News