Thursday, May 2, 2024

తెలంగాణలో 346 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana reported 631 new Covid positive cases

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 346 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 2.89 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 1561 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వారి 2.82 లక్షలుండగా ఐదు వేల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల విషయంలో తెలంగాణ 11 స్థానంలో ఉండగా మృతుల విషయంలో 17వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 71.5 లక్షల మంది కరోనా పరీక్షలు చేయగా టెస్టుల విషయంలో తెలంగాణలో 11వ స్థానంలోనే ఉంది. కరోనా కేసులు(19.58 లక్షలు), మృతులు(51 వేలు) సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా టెస్టుల విషయంలో ఉత్తర ప్రదేశ్ (2.5 కోట్లు) తొలి స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News