Sunday, April 28, 2024

రాజస్థాన్‌లో కరోనా వైరస్ కలకలం

- Advertisement -
- Advertisement -

Coronavirus

జైపూర్ : రాజస్థాన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జైపూర్ లో ఓ విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కాగా, అధికారులు రక్తనమూనాలను సేకరించి పూణెకు పంపారు. కాగా ఇటీవలే చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన  విద్యార్థి జైపూర్ కి వచ్చాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని రకాల జంతుమాంసాలు తినడంపై చైనా సర్కార్ నిషేదం విధించింది. చైనాలో ఉన్న భారతీయులెవరికీ కరోనా సోకలేదని భారత విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత పౌరుల కోసం బీజింగ్ లో మూడు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. అటు చైనాలో కరోనా భారినపడి ఇప్పటి వరకు 80మంది మృతిచెందినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ రోజుకు మూడు నుంచి 500మందికి సోకుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే చైనా వైద్యులు కరోనాకు విరుగుడు కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు.

Coronavirus Scare in Rajasthan China Returned Doctor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News