Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన కార్పొరేటర్

- Advertisement -
- Advertisement -

Corporator planted Trees in Green India challenge

హన్మకొండ: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుధవారం హన్మకొండలోని హంటర్ రోడ్ లో విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కవిత, కిషన్ ల నేతృత్వంలో టిఎస్పిఎస్ సి సభ్యులు కారం రవిందర్ రెడ్డి చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల ఆదర్శ వివాహం చేసుకున్న నడిపెల్లి శ్రీధర్ రావు (ఒసి), అరుణ (ఎస్ సి) దంపతులచే మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నది. పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత అని గుర్తుచేస్తున్నది. ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములు అయి హరిత తెలంగాణ నుండి హరిత భారత నిర్మాణం వైపు అడుగులు వేయాలి. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు మల్లుకార్జున్, రామస్వామి, విద్యాసాగర్, ఈశ్వరయ్య జాగృతి నాయకులు డా. రాజేశ్వర్ రావు, స్థానిక నేతలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News