Tuesday, April 30, 2024

గ్రేటర్‌లో కరోనా టీకా కేంద్రాలు పెంపు

- Advertisement -
- Advertisement -

Covid-19 vaccination centers increase in hyderabad

వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రులకు జనం క్యూ
నేరుగా వచ్చి టీకా తీసుకునేందుకు వైద్యశాఖ వెసులుబాటు
రోజుకు 200మందికి పైగా తరలివస్తున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
నగరంలో వ్యాక్సిన్ కేంద్రాలు 50కి చేరుకునేలా వైద్యశాఖ కసరత్తు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో సాధారణ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రావడంతో తీసుకునేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 60సంవత్సరాలు పైబడిన వృద్దులతో పాటు 45ఏళ్ల నుంచి 59ఏళ్ల వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి టీకా వేసేందుకు జిల్లా వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం హైదరాబాద్ జిల్లాల్లో 12 ప్రభుత్వ, 15 ప్రైవేటు ఆసుపత్రులు, మేడ్చల్ జిల్లాలో 3 ప్రభుత్వ, 7 ప్రైవేటుఆసుపత్రుల్లో టీకా ఇచ్చేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈనెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ ప్రారంభించడంతో మూడు రోజుల పాటు తక్కువ సంఖ్యలో జనం రాగా శుక్రవారం నుంచి ఒక్కొక్క ఆసుపత్రికి 200లకు పైగా మంది ప్రైవేటు ఆసుత్రులకు వస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు 65వేల మంది స్వచ్చందంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నట్లు, జనం రద్దీ పెరగడంతో పంపిణీ కేంద్రాలు పెంచుతున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కలెక్టర్ పలు ఆసుపత్రులను సందర్శించి టీకా తీసుకునే వారు ఇబ్బందులు పడకుండా కూర్చోవడానికి కుర్చీలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని చోట్ల సక్రమంగా వసతులు లేకపోవడంతో వెంటనే ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేశారు. దీంతో అధికారులు వసతులతో పాటు, మరో 10 ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రులను పెంచి గ్రేటర్ జిల్లాల పరిధిలో మొత్తం 50 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసే విధంగా ప్రయత్నాలు వేగం చేసినట్లు వివరిస్తున్నారు. కోవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకోవడం సులభం చేయడంతో చాలామంది టీకా కోసం ఆసుపత్రులకు వెళ్లుతున్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులైన యశోధ, విరంచి, కిమ్స్ ఆసుపత్రుల్లో టీకా ఖరీదు రూ. 150లు తీసుకుని సర్వీసు చార్జీ తీసుకోవడం లేదు. ఈఅవకాశంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో 60ఏళ్లకు పైబడిన వారికోసం 6లక్షల టీకాలు సిద్దంగా ఉంచినట్లు, సాదారణ ప్రజలకు ఐదు నెలల పాటు వ్యాక్సిన్ వేస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నగర ప్రజలు వ్యాక్సిన్ వచ్చిందని, వైరస్ పట్ల నిర్లక్షం చేయవద్దని, ముఖానికి మాస్కులు, శానిటైజర్, వ్యక్తుల మధ్య బౌతికదూరం పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News