Tuesday, April 30, 2024

బేగం పేట్ విన్ హాస్పిటల్ నిర్వాకం… కోవిడ్ రోగిని బంధించి

- Advertisement -
- Advertisement -

Covid Patient captured in Vinn hospital

హైదరాబాద్: అల్వాల్ కి చెందిన రామారావు అనే వ్యక్తిని హాస్పిటల్ నుండి బయటకు వెళ్లకుండా విన్ ఆస్పత్రి యాజమాన్యం బంధించింది. రామారావు అనే వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 1న విన్ ఆస్పత్రిలో చేరారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో చికిత్స అయ్యే ఖర్చు మొత్తం తాము హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లైమ్ చేసుకుంటామని ఆస్పత్రి ఆడ్మిన్ డిపార్ట్ మెంట్ తెలిపింది.  కోవిడ్ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయితే అవసరం లేని టెస్టులు చేసి బిల్లును నాలుగు లక్షలు రూపాయలు చేశారు. టెస్టులు చేయకున్న చేసినట్టు చూపించడంతో ఇన్సూరెన్స్ క్లైమ్ చేయకుండా సదరు కంపెనీ నిలిపివేసింది. నాలుగు లక్షలు కట్టే వరకు రోగిని డిశ్చార్జ్ చేసేది లేదని యాజమాన్యం తెలిపింది. దీంతో 20 రోజుల నుంచి రామారావును ఆస్పత్రి యాజమాన్యం బంధించింది. రామారావు బంధువులు మంత్రి కెటిఆర్, ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. రామారావుకు గుండె జబ్బు ఉందని బెడ్ ఏర్పాటు చేయాలని ప్రాదేయపడిన కూడా యాజమాన్యం కనికరించడంలేదని వారు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News