Sunday, April 28, 2024

అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ

- Advertisement -
- Advertisement -

plasma therapy

 

ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స
మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు
రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు,
మళ్లీ దాతకే బ్లడ్

మన తెలంగాణ/హైదరాబాద్ : బ్లడ్ ప్లాస్మా థెరపీతో కేవలం 3 నుంచి 7 రో జులలోపు కొవిడ్ 19 రోగులను నయం చేయవచ్చు. ఒక దాత నుంచి సేకరించిన ప్లాస్మా తో కనీసంగా ఇద్దరు గరిష్టంగా ఐదుగురు రో గులకు చికిత్స అందిస్తారు. అయితే ఇదంతా అనకున్నంత సులువుగా కాదని వైద్య నిపుణు లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రక్త సేకరణ మార్గదర్శకాలను సవరించాలి. ముఖ్యంగా దాతల విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ మొదలవగా, రాష్ట్రంలోనూ ప్లాస్మా థెరపీపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి.

క్లినియల్ ట్ర యల్స్ విజయవంతంగా పూర్తయి, అయితే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ మన తెలంగాణకు చెప్పారు. ఒక రోగిని న యం చేయడానికి సుమారు 200 నుంచి 250 మి.లీ ప్లాస్మా అవసరం ఉంటుంది. యుఎస్, చైనాలో చేసిన అధ్యయనాల ఆధారంగా, ప్రాక్టికల్స్‌ను బట్టి ప్లాస్మా ఇచ్చిన తరువాత నయం అయ్యేందుకు మూడు నుంచి ఏడు రోజులు సమయం పడుతుంది.

ఒక వ్యక్తి నుంచి లీటరు వరకు ప్లాస్మా
ఒక వ్యక్తికి వైరస్ లేదా బ్యాక్టీరియా సోకినప్పుడల్లా, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీని అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రతిరోధకాలు నిర్దిష్ట సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా జీవితకాల రోగ నిరోధక శక్తిని లేదా స్వల్పకాలిక రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. కరోనావైరస్ నుండి కోలుకున్న రోగులు ఈ ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తారు, ఇవి ఇమ్యునైజేషన్ కోసం ఉపయోగిస్తారు. దీంతో రోగి కోలుకున్నప్పుడు, వారికి ప్రతి రోధకాలు ఉంటాయి. ఆ సమయంలో రోగి రక్తంలో వైరస్ కూడా ఉండదు. రోగి ప్లాస్మా తీసుకునే క్రమంలో ప్లాస్మా మాత్రమే తీసుకొని మిగిలిన రక్తం శరీరానికి తిరిగి ఇస్తారని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి నుండి 500 మిల్లి లీటర్ల నుంచి లీటరు వరకు ప్లాస్మా తీసుకోవచ్చు. అదే రక్తం పరంగా చూస్తే దాత నుండి 350 మి.లీ మాత్రమే తీసుకోవచ్చు. యాంటి బాడీ అధికంగా ఉండే ప్లాస్మా రోగులకు ఇస్తారు. మార్పిడి చేయబడిన ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీ వైరస్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. తద్వారా రోగం నయమవుతుంది. దీనిని ఇమ్యునైజేషన్ (నిష్క్రియాత్మక రోగ నిరోధకత) అంటారు.

28 రోజులు పూర్తయితేనే
అయితే ప్లాస్మా సేకరణలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాలంటీర్ దాతల నుండి రక్తం మరియు ప్లాస్మాను సేకరించడానికి కొన్ని ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు అనుసరిస్తున్న జాతీయ మార్గదర్శకాలు ఉన్నాయి. దాతల ఎంపిక మార్గదర్శకాల ప్రకారం కోలుకున్న రోగులు దానం చేయడానికి అర్హులు కాదు. కొవిడ్ 19 నుంచి కోలుకున్న వ్యక్తి 28 రోజులు పూర్తయి ఉండాలి. ప్లాస్మా సేకరణకు అది కనీస సమయ వ్యవధిగా వైద్యులు చెబుతున్నారు. డోనర్ వయసు 18 నుంచి 50 ఏండ్లమధ్య ఉండాలి. బరువు 50 కేజీల కంటే ఎక్కువ ఉండాలి.

గుండె.. కిడ్నీ, శ్వాస సంబంధ వ్యాధులు ఉండొద్దు
రక్తాన్ని సేకరించే ముందు డోనర్ అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వారి రక్తంలో హీమోగ్లోబిన్ కనీసం 12.5 పాయింట్లు, అంతకంటే ఎక్కువగా ఉండాలి. డోనర్ నుంచి ఒకసారి 350 మిల్లీ లీటర్ల రక్తాన్నిమాత్రమే సేకరించాలి. అవసరమైతే 48 గంటల తర్వాత మళ్లీ అదే డోనర్ నుంచి మరో 350 మిల్లీ లీటర్లు తీసుకోవచ్చు. డొనేషన్ టైమ్‌లో బి.పి కనీసం 100/60 నుంచి 150/90 మధ్య ఉండాలి. వారికి గత ఆరు నెలల్లో ఎలాంటి ఆప రేషన్లు జరిగి ఉండకూడదు. శ్వాస సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండకూడదు. డోనర్లుగా మగవాళనే ్ల ప్రిఫర్ చేయాలి. అత్యవసరమైతే ఆడవాళ్లనుంచి కూడా తీసుకోవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల నుంచి తీసుకోవ ద్దు. అలాగే డోనర్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ కూడా కలవాల్సి ఉంటుంది.ప్లాస్మా చికిత్స పొందే గ్రహీతకు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. వైరస్‌తో తీవ్ర అనారోగ్యం పాలైనవారు.

 

Covid patients may be treated with plasma therapy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News