Monday, April 29, 2024

క్వారంటైన్లు ఖాళీ

- Advertisement -
- Advertisement -

Quarantine Period

 

ఇంకుబేషన్ పీరియడ్ ముగియడంతో డిశ్చార్జి
ఇక హోం క్వారంటైన్లపై నిఘా, జియో ట్యాగింగ్‌తో నిరంతరం పర్యవేక్షణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో బాధపడే వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఐసోలేషన్లు ఖాళీ అవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారితో పా టు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు, వారు కలిసిన వారికి క్వారంటైన్ సహా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ ముగియడంతో ఇంటికి పంపిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే సరోజినీదేవి కంటి ఆస్పత్రి, బల్కంపేటలోని నేచర్‌క్యూర్, చార్మినార్‌లోని నిజామియా ఆస్పత్రి కార్వంటైన్ సెంట ర్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి.

రాజేంద్రనగర్‌లో ఐదు క్వారంటైన్ సెంటర్లు ఉండగా వీటిలో ప్రస్తుతం 160 మంది మాత్రమే ఉండగా, మేడ్చల్ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లా లో 135మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. గాంధీ, కింగ్‌కోఠి, ఫీవర్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 364 మంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతు న్న వారు చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే ఐసియూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని హోం కార్వంటైన్‌కు తరలించి, వారు ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

పోలీసు నిఘాలో వీరు..
మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన జమాత్ కు తెలంగాణ నుంచి 1,089 మంది వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 603 మంది ఉండగా, వీరితో సన్నిహితంగా మెలిగినవారు 3,015మంది ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు వారందరిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. వైరస్ కేవలం బాధితు లు, వారి కుటుంబ సభ్యుల వరకే పరిమితమయ్యిందా లేదా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఏమై నా జరిగిందా అన్న విషయాలకు సంబంధించి వివరాలను రెండు మూడు రోజుల్లో తెలుస్తాయ ని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

 

అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్ సెంట ర్‌లో శనివారం ఉదయం వరకు 295 పాజిటివ్ కేసులు ఉండగా, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు మరో 250 మంది ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 29పాజిటివ్ కేసులు ఉండగా, ఆస్ప త్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 10 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి లో 12 పాజిటివ్ కేసులు ఉండగా, ఐసోలేషన్ వార్డులో మరో 74 మంది అనుమానితులు ఉన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో 30 మంది అనుమానితులు ఉన్నారు. దీంతోపాటు హోం క్వారంటైన్లపై జియో ట్యాగింగ్‌తో అధికారులు నిరంతర నిఘా పెట్టడంతో ఇళ్లు దాటి బయటకు రావడానికి అనుమానితులు జంకుతున్నారు.

 

Discharge at end of Quarantine Period
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News