Sunday, April 28, 2024

ఆ మూడు రాష్ట్రాల ఉల్లి మనకొద్దు

- Advertisement -
- Advertisement -

onions

 

కరోనా ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటక, ఎపి నుంచి దిగుమతులపై ఆంక్షలు

రాష్ట్రంలో మెండుగా నిల్వలు, ఇక్కడ సాగైన ఉల్లినే విక్రయించాలి

మార్కెటింగ్ శాఖ ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రభావం ఉల్లి మీద పడనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిగడ్డలను మార్కె ట్లో విక్రయించడానికి మార్కెటింగ్ శాఖ ఆంక్ష లు విధించింది. ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఉల్లిని దిగుమతి చేయరాదని, వాటిని ఆపేయాలని తాజాగా నిర్ణయించింది. తెలంగాణ జిల్లాల్లో పండించిన ఉల్లిగడ్డలను మాత్రమే సోమవారం నుంచి మార్కెట్లలో విక్రయించాలని రాష్ట్ర రైతులు తెచ్చే ఉల్లిగడ్డలను మాత్రమే కొనాలని వ్యాపారులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిగడ్డ లోడ్ లను మార్కెట్ సముదాయంలోకి రానివొద్దం టూ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉల్లి పంటలు అధికంగా పండాయని, ఉల్లి నిల్వలు చాలా ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. అందుకే ఇతర రాష్ట్రాల ఉల్లిగడ్డ ప్ర స్తుతానికి అవసరం లేదన్నారు. మార్కెట్ యా ర్డు నిర్ణయించిన ఈ నిబంధనలను టోకు వ్యా పారులు కూడా అంగీకరించారని తెలిపారు.

ఇక మలక్ పేట్ మార్కెట్లో రైతుల రక్షణను దృష్టి లో పెట్టుకుని సోడియం హైపో క్లోరైడ్ ఛాంబర్లను నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సగటున 25 వేల క్వింటాళ్ల వరకు ఉల్లి రాష్ట్రానికి దిగుమతి అవుతుంది. మన రాష్ట్రంలో ఒక్క రోజుకు ఒక వ్యక్తికి 25 గ్రాముల ఉల్లి అవసరత ఉంది. రాష్ట్ర జనాభాను 3.52 కోట్లుగా అనుకుంటే రోజుకు 880 మెట్రిక్ టన్నులు, ఏడాదికి 3.21 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి. అయితే మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, వికారాబాద్ జిల్లాలలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో ఉల్లి సాగైంది. దిగుమతి అవుతున్న ఉల్లి ఆగిపోతే మన దగ్గర సాగు అవుతున్న ఉల్లితో పెద్దగా అంతరం ఏమి ఉండదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పక్క రాష్ట్రాలలో కేసులు అధికమైతే నిత్యావసరాల సరఫరాను కూడా అక్కడి నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశించారు.

 

We have to sell our onions
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News