Monday, May 6, 2024

మోడీ మదిలో 3 జోన్లు?!

- Advertisement -
- Advertisement -

modi

 

కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన

రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం

ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న ప్రాంతం

గ్రీన్ జోన్ : కరోనా కేసులు లేనటువంటి ప్రాంతాలు

ఆయా స్థాయిల్లో ఆంక్షల సడలింపు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలకు వెసులుబాటు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకూ మినహాయింపు

మిగతా రంగాలపై ఆంక్షలు యథాతథం

భిన్న వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్న కేంద్రం

ప్రధాని లాక్‌డౌన్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ

రేపటితో ముగియనున్న లాక్‌డౌన్ గడువు

న్యూఢిల్లీ: ఏప్రిల్ 14… కరోనా కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రో జుల లాక్‌డౌన్ ముగిసే రోజు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొన్న ఈ కఠిన నిర్ణయానికి వైరస్ ఈ పాటికి కట్టడి అయి ఉండాల్సిందే. అయితే దురదృష్టవశాత్తు కేసుల సంఖ్య తగ్గకపోగా కొత్త కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ అంశం తెరపైకి వచ్చి ంది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసు లు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. ఈ రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం అ న్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ప్రధాని సైతం ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. ‘ జాన్‌భీ.. జహాన్ భీ’ (ప్రాణాలతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే) అని ఆయ న సిఎంలతో అన్నారు. అయితే సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు దాదాపు అందరు కూడా లాక్‌డౌన్‌ను మరికొంత కా లం పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెలాఖరు వర కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించా యి. అయితే దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. మంగళవారం లాక్‌డౌన్ గడు వు ముగిసే లోగా ప్రధాని మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని, ఆ సందర్భంగా లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. క రోనా కేసులు పెరుగుతున్న వేళ గత ఆదివారం ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడారు. అలాగే బుధవారం విపక్షాల ఎంపిల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. శనివారం వివిధ రాష్ట్రాల సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ కూ డా నిర్వహించారు. ఏకాభిప్రాయ సాధనే ఈ భేటీల ముఖ్య ఉద్దేశం అని స్పష్టమవుతోంది.

అయితే మరో విడత లాక్‌డౌన్ వి ధించాలంటే ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టి లో ఉంచుకోవాలన్నది ప్రధాని ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి లాక్‌డౌన్‌లో కొన్ని మార్పులు ఉంటాయనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.. ప్రజల ఆకాంక్ష కూడా. అయితే ఆయా వర్గాలనుంచి వచ్చిన అభిప్రాయాలపై మంగళవారం మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ప్రధాని లాక్‌డౌన్‌పై నిర్ణయాన్ని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని లాక్ డౌన్ నిర్ణయంతో ముందుకు రావచ్చని కూడా ఆ వర్గాలు అంటున్నాయి.

మూడు జోన్లుగా వర్గీకరణ!
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం కరోనా కట్టడితో పాటుగా ఇప్పటికే కుదేలయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రధాని కొన్ని ప్రాంతాలు, రంగాల విషయంలో కొన్ని సడలింపులు ప్రకటించవచ్చని తెలుస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించినప్పటికీ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దేశాన్ని మూడు జోన్లుగా అంటే గ్రీన్ జోన్,ఆరంజ్ జోన్, రెడ్‌జోన్లుగా విభజించే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం జరిగిన ముఖ్యంత్రుల సమావేశంలో కొందరు సిఎంలు కూడా ఇదే ప్రతిపాదన చేశారు. ఇందులో మొదటిదైన గ్రీన్ జోన్లు. కరోనా ప్రభావం ఎంతమాత్రం లేని జిల్లాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు లేని జిల్లాలు దాదాపు 400 ఉన్నాయి.

అక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసి ప్రజలు స్వేచ్ఛగా తిరగడంతో పాటుగా రవాణా సేవలు వంటి వాటిని కూడా పునరుద్ధరిస్తారు. ఇక 15 అంతకంటే ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూసిన ప్రాంతాలు ఆరంజ్ జోన్లుగా గుర్తిస్తారు. ఇక్కడ పరిమిత సంఖ్యలో ప్రజా రవాణాను అనుమతించడం, వ్యవసాయ పంటల కోతలు, ధాన్య సేకరణ వంటి కార్యకలాపాలను అనుమతించడం జరుగుతుంది. ఇక చివరగా 15కన్నా ఎక్కువ కరోనా కేసులున్న అన్ని ప్రాంతాలు రెడ్‌జోన్ల కిందికి వస్తాయి. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తారు. ప్రజల రాకపోకలు వంటివాటిని అనుమతించరు. ఇప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్ననగరాలు, పట్టణాల్లో ఇదే విధానం కొనసాగుతోంది.

వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగాలకూ..
కాగా రియల్ ఎస్టేట్‌తో పాటుగా మౌలిక సదుపాయాల రంగం పూర్తిగా స్తంభించి పోయిన కారణంగా లక్షలాది వలస కూలీల బతుకులు దుర్భరంగా మారిన విషయం తెలిసిందే. అలాగే రబీ పంటల కోతల సీజన్ మొదలు కానుండడంతో వేలాది మంది కూలీల అవసరంతో పాటుగా పండించిన పంటను రైతులు అమ్ముకోవడం కూడా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాలకు కాస్త వెసులుబాటు కల్పించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు లాక్‌డౌన్‌నుంచి మినహాచింపు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విషయంలోను మినహాయింపు ఉండే అవకాశముందని చెబుతున్నారు. పరిమిత స్థాయిలో శ్రామిక శక్తి అవసరమైనందున ఇక్కడ సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంది. శనివారం సిఎంల భేటీలోను మోడీ ఈ రంగాలకు వెసులుబాటు ఇచ్చే విషయాన్ని సూచన ప్రాయంగా తెలియజేశారు కూడా.

అయితే పెద్ద సంఖ్యలో జనం చేరే అవకాశమున్న పాఠశాలలు, మాల్స్ , థియేటర్లకు మాత్రం ఏమాత్రం అనుమతి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే వివాహాలు లాంటి ఫంక్షన్లు, వేకెండ్ పార్టీలు లాంటి వాటిపైనా ఆంక్షలు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ప్రయాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటానేది సర్వత్రా ఆసక్తిగా ఉంది. దేశంలో కరోనా తీవ్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణాలకు అనుమతిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, వైరస్ వ్యాప్తి పెరిగి పోతుందని అధికారులతో పాటుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఆయా రాష్ట్రాల్లో చిక్కుపడి పోయి స్వస్థలాలకు చేరుకోవాలన్న ఆదుర్దాలో ఉన్నారు. వారికి ఏమయినా ఊరట ఉంటుందేమో చూడాలి. ఏది ఏమయినా లాక్‌డౌన్‌ను పొడిగించడం ఖాయంగా కనిస్తున్న తరుణంలో అది ఏవిధంగా ఉంటుందనేది ప్రధాని చేసే ప్రకటనపై ఆధారపడి ఉంది. దీనికోసం మరికొన్ని గంటలు వేచి ఉండక తప్పదు.

3 zones depending on corona intensity
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News