Thursday, May 9, 2024

కరోనా ప్రతాపం

- Advertisement -
- Advertisement -

Corona cases

 

ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్‌లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు : కేంద్రం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పాకి కోట్లాది మంది ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ పడగలు విప్పుతోంది. దేశంలో కోవిడ్19 బారిన పడ్డవారి సంఖ్య ఆదివారం నాటికి 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదు కాగా 34 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 7,367 మంది ఆస్పత్రుల్లో కోలుకుంటుండ గా, 716 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా మరణాలతో కలుపుకొని ఇప్పటివరకు మరణించిన వారి సం ఖ్య 273కు పెరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 127 మరణాలు సంభవించగా, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 22, ఢిల్లీలో 19 మంది చనిపోయారు. తమిళనాడులో శనివారం రాత్రి 45 ఏళ్ల మృతి చెందడంతో అక్కడ మరణాల సంఖ్య 12కు చేరుకుంది. కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర వణుకుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1761కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా మరో 134 మందికి ఈ వైరస్ సోకిం ది. వీటిలో ఒక్క ముంబయిలోనే 113 కేసులు నమోదైనాయి.

ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు మహారాష్ట్రలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని ప్రముఖ తాజ్ హోటల్‌లోని దాదాపు 500 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో కొందరికి వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని ఆస్పత్రిలో చేర్పించడం జరిగిందని వారితో సన్నిహితంగా మెలిగిన వారిని వెంటనే క్వారంటైన్‌లో ఉంచడం జరిగిందని హోటల్ ఒక ప్రకటనలో తెలిపింది. మరో వైపు మహారాష్ట్ర తర్వాత కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తమిళనాడులో కేసుల సంఖ్య 1057కు చేరింది. కాగా ఢిల్లీలో ఈ ఒక్క రోజే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 కొత్త కేసులు నమోదైనాయి. మరోవైపు రాజస్థాన్‌లో ఒక్క రోజే 51 కరోనా కేసు లు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 751కి పెరిగినట్లు తెలిపారు. ఇందులో316 కేసులు జైపూర్‌లోనే నమోదైనాయి.

సన్నద్ధత పెరిగింది: అగర్వాల్
కాగా పెరుగుతున్న కేసుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ సన్నద్ధత కూడా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి 1000 అవసరమైతే తాము 85 వేల పడకలను సిద్ధం చేశామని, నేడు 1671పడకలు అవసరమైతే 601 ఆస్పత్రుల్లో లక్షా 5 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. దేశంలో 151 ప్రభుత్వ రంగ, 68 ప్రైవేటు కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇప్పటివరకు 1,86,906 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ అధికా రి డాక్టర్ ముర్కేకర్ వెల్లడించారు. 40 వ్యాక్సీ న్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ అవేవీ తదుపరి దశకు చేరుకోలేదన్నారు. కరోనా చికిత్సలో అద్భుతంగా పని చేస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను 13 దేశాలకు ఎగుమతి చేయనున్నామన్నారు.

 

909 new Corona cases in the country
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News