Monday, April 29, 2024

రాష్ట్రంలోనూ ఫసల్ బీమా

- Advertisement -
- Advertisement -

ఫసల్‌బీమా అమలు చేస్తాం: సిఎం రేవంత్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులకు దన్నుగా నిలుస్తూ ఈ రంగాన్ని బలోపేతం చేయటమే తమ ప్రభుత్వ లక్షం అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాగురంగంలో ప్రతికూలతలను తట్టకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరిందన్నారు. సచివాలయంలో శుక్రవారం సిఎం రేవంత్‌రెడ్డితో వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫసల్‌బీమా పథకం సీఈవో కేంద్ర కార్యదర్శి రితేష్ చౌహన్ సమావేశమయ్యారు.

ఫసల్‌బీమా పధకంపై చర్చించారు. వచ్చే పంటకాలం నుంచి ఈ పధకం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపారు.రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం కేంద్ర ప్రభుత్వ పథకాలకు, విధానాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్దికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సిఎం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు,డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News