Thursday, May 2, 2024

మల్లారెడ్డి మెడికల్ కళాశాలల్లో కోట్లలో నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో 16చోట్ల ఇడి అధికారుల తనిఖీలు చేశారని తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్లు తనిఖీలు జరిగాయి. పిజి మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు చేశామన్నారు. మనీ లాండరింగ్‌కు సంబధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లుగా తెలిపింది.

పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఇడి ప్రకటించింది. మంత్రి మల్లారెడ్డికి చెందిన వైద్య కాలేజీలోనే ఎక్కువ మొత్తం నగదు లభించింది. మల్లారెడ్డి వైద్య కళాశాలలో లెక్కల్లో చూపని 1.4కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో అనధికారికంగా ఉన్న 2.89కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. పిజి మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఇడి సోదాలు నిర్వహించింది.

కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఇడి మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. 20 ప్రత్యేక బృందాలతో మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఇడి సోదాలు నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News