Saturday, April 27, 2024

బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కుతోనే కవిత అరెస్ట్ : మాజీ మంత్రి సత్యవతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనందువల్లే ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు సోదాలు జరిపారని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎంఎల్‌సి కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఎంఎల్‌సి కవిత ఇంట్లో సోదాలు, ఆమెను ఇడి అధికారులు అరెస్ట్ చేయడంపై సత్యవతి రాథోడ్ స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా, ఎంఎల్‌సి కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇన్ని రోజులు పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల ముంగిట కవితను అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు. ఇడి అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా బలహీన పరిచేందుకు ప్రధాని నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బిఆర్‌ఎస్ నాయకులు భయపడరని పేర్కొన్నారు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. చట్టపరంగా న్యాయస్థానాల్లోనూ పోరాడతామన్నారు. ఎంఎల్‌సి కవితకు బిఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News