Sunday, April 28, 2024

ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన 100 రోజుల పాలన : మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజా పాలనే లక్ష్యంగా తాడిత, పీడీత,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సాహసోపేత నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పాలనను సాగిస్తూ సీయం రేవంత్ రెడ్డి తన పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. గత పాలకుల తీరుకు భిన్నంగా రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం వంద రోజుల పరిపాలన ప్రజల అకాంక్షలకు అద్దం పట్టిందని తెలిపారు. నియంతృత్వానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ప్రజా పాలన నిరంతరం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

అస్తవ్యస్తమైన పాలనను గాడీలో పెట్టడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం, రాష్ట్ర అభివృద్దికి బాటలు వేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఓ ప్రకటనలో మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కనీసం ఆరు నెలలైనా గడవక ముందే పాలనపై ఓ అంచనాకు రావడం కష్టమని అలాంటిది 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరస్తూ, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని ఇది ప్రజా ప్రభుత్వమని నిరూపించామని వెల్లడించారు. ఎన్నో చారిత్రాత్మకమైన దిక్సూచి లాంటి నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని వెల్లడించారు. వీటితోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, పంటల బీమా , రైతునేస్తం లాంటి పథకాల అమలుతో పాటు, 29 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అద్వాన్న పరిస్థితిలోకి నెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఖర్చుల నియంత్రణ చేసి, ఆర్థిక ప్రగతికి బాటలు వేశామని. చెప్పారు. 100 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని, వారు ఎంత గీ పెట్టిన ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News