Sunday, May 12, 2024

మేడారంలో ముగిసిన తెలంగాణ బచావో యాత్ర

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి: తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన రెండు రోజుల తెలంగాణ బచావో యాత్ర గురువారం మేడారంలో ముగిసింది. మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని ప్రజాస్వామ్యాన్ని మరిచి రాచరికంలో మునిగిపోయాయని అన్నారు.

ప్రజలను చైతన్యపరిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట నుండి బుధవారం మొదలైన తెలంగాణ బచావో యాత్ర గురువారం మేడారం మేడారంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్‌రావులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News