Sunday, April 28, 2024

అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: అమరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీ రులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, ఎంఎల్‌సి ఎల్.రమణ, జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద్, జిల్లా ఎస్‌పి భాస్కర్‌లు నివాళులర్పించారు.

ఈ సంద ర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ ఎంతోమంది ఆత్మబలిదానాలు చేశారని, వారికి నివాళులర్పించి జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి ద శ ఉద్యమంలో 369 మంది అసువులు బాయగా మలి విడత ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు.

ఆంధ్రా పాలకుల పెత్తనంతో తెలంగాణకు అన్ని విధాలా జరిగిన నష్టాన్ని చూడలేక ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే మన బతుకులు బాగు పడుతాయని చావుకు ఎదురెల్లి తెలంగాణ ఆకాంక్షను చాటారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ సంస్కృతి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు 30 యేళ్ల పాటు తెలంగాణ ఉద్యమం కొనసాగిందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందు కు ఆంధ్రా పాలకులు అన్ని ప్రయత్నాలు చేశారని, అయినా వారి ఆటలు కట్టించి తెలంగాణ సాధించుకున్నామన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల స్థూపాలను నిర్మించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు.

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ప్రాణాలు తీసుకురాలేమని, కానీ వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా శాంతి కపోతాలను ఎగురవేసి అమరవీరులకు శ్రధ్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News