Thursday, August 7, 2025

లోయలోకి దూసుకెళ్లిన సిఆర్‌పిఎఫ్‌ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఉధంపూర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం కద్వా బసంత్‌గఢ్‌ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మరణించగా, 15 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 187వ బెటాలియన్‌కు చెందిన జవాన్ల బృందం బసంత్ ఘర్ నుండి ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News