Tuesday, April 30, 2024

రూ.58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సిఎస్ వివరణ

- Advertisement -
- Advertisement -

CS explanation to the High Court

మనతెలంగాణ/హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సిఎస్ సోమేష్ కుమార్ గురువారం నాడు వివరణ ఇచ్చారు. రూ. 58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని, భూసేకరణ పరిహారం చెల్లింపు కేసుల్లో కోర్టు ధిక్కరణ కేసుల కోసమేనని ఎజి తెలిపారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సిఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామని సిఎస్ పేర్కొన్నారు. నిధులు విడుదల చేయొద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఎజి బిఎస్ ప్రసాద్ న్యాయస్థానాన్ని కోరారు. ఇదిలా ఉండగా జివొ రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఆ జివొ తయారు చేసిన ఉద్దేశం ఏంటి? కాగితంపై రాసిందేంటి? అని న్యాయస్థానం ప్రశ్నించింది. జివొను పరిశీలిస్తే కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగా జివొ ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జివొవిడుదల చేసే ముందు ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా? అని హైకోర్టు పేర్కొంటూ… తదుపరి విచారణ సోమవారం నాటికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News