Wednesday, May 8, 2024

రిజిస్ట్రేషన్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Launching Online Slot Booking

హైదరాబాద్: తెలంగాణ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా141 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ధరణి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. స్లాట్ బుకింగ్ లో ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ… సులువుగా ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. పిటిఐఎన్ సంఖ్య లేనివారు కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రెండ్రోజుల్లో పిటిఐఎన్ నెంబర్ ఇస్తామన్నారు. అధికారులకు ఎలాంటి విచక్షణాధికారాలు ఉండబోవని చెప్పారు. ఆన్ లైన్ లేదా చలానా ద్వారా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించొచ్చని ఆయన పేర్కొన్నారు.

ధరణిలో కొన్ని సేవలు తక్షణమే ప్రారంభం అవుతాయని సోమేష్ కుమార్ వెల్లడించారు. అమ్మకం, గిఫ్ట్, సేల్ అగ్రిమెంట్, మార్ట్ గేజ్, డెవలప్ మెంట్ అగ్రిమెంట్ తదితరాలు చేయొచ్చని సిఎస్ తెలిపారు. దాదాపుగా 96 శాతం సర్వీసులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగితా సర్వీసులు కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆధార్ తప్పనిసరి కాదు.. ఆధార్ ఇవ్వని వారికోసం వేరే ఏర్పాట్లు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కూడా ఆన్ లైన్ లో వెంటనే జరుగుతుందని సిఎస్ సూచించారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డేలాకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ 18005994788 ఏర్పాటు చేసినట్టు సోమేశ్ కుమార్ తెలిపారు.

CS Somesh Kumar Launching Online Slot Booking

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News