Wednesday, May 1, 2024

కాంగ్రెస్‌కు గడ్డుకాలం!

- Advertisement -
- Advertisement -

Telangana Congress leaders clashes over tpcc chair

హైదరాబాద్: నగర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ఆపార్టీకి చెందిన సీనియర్లు దూరమైతున్నారు. ఇప్పటికే పిసిసి పీఠం కోసం నాయకులు తగువులాడుతుంటే మరోపక్క గ్రేటర్ నాయకులు సొంతదారి చూసుకుంటున్నారు. హస్తం పార్టీ అధికారానికి కన్నుచూపు మేరలో ఉందని గులాబీ, కమలం పార్టీలవైపు క్యూ కడు తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కొంత మంది నాయకులు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, మరి కొందరు కాషాయం జెండా పట్టారు. ఇప్పటికే శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, తనయుడు రవికుమార్‌యాదవ్, మరుసటి రోజు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమా రుడు విక్రంగౌడ్, రెండు రోజుల కితం సినీనటి విజయశాంతి కూడా పార్టీ వీడి కాషాయం కండువా కప్పుకున్నారు. తాజాగా నగర పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్‌కుమార్ యాదవ్ హస్తం పార్టీకి రాజీనామా చేశారు.

దీంతో నగర కాంగ్రెస్ శ్రేణుల్లో పార్టీకి ఒక్కొక్కరు జెండా మారేందుకు సిద్ధ్దమైతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్ర మేయం లేకుండా కార్పొరేటర్ సీట్లు ఇవ్వడంపై అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏకమై బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేత లను విస్మరిస్తూ తమకు నచ్చినవారికే పార్టీలో అందెలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. తన రాజీనామా మాత్రం పా ర్టీలో పదోన్నతి కోసం చేశానని, హస్తం పార్టీ వీడేది లేదని, బిజెపిలో చేరుతాననే పుకార్లు నమ్మవద్దని కొట్టి పారేశారు. అనుచరులు మాత్రం పార్టీ పదోన్నతి కోసం రాజీనామా చేయాల్సి పని ఉండదని వెల్లడి స్తున్నారు. టిపిసిసి కోసం ఆశిస్తే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అంజన్‌కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి 2001 సంవ త్సరంలో నగర పార్టీ అధ్యక్షులు పనిచేశారు. ఎం తో సమర్థ్దవంతంగా పనిచేయడంతో 2004 ఎన్నికల్లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్ ఆయన సేవలు గుర్తించి సికింద్రాబాద్ పార్లమెంటు టికెటు ఇచ్చారు.

ఆ ఎన్నికలో అంజన్‌కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్రాత్తేయపై లక్షపై మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి నగర రాజకీయాల్లో అంజన్ తనదైన ముద్ర వేసుకుంటూ పార్టీకి సేవలందిస్తున్నారు. మళ్లీ 2009లో ఎన్నికల్లో కూడా ఆయన రెండోసారి ఎంపీగా విజయకేతనం ఎగురవేసి గ్రేటర్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. తరువాత తనయుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పా ర్టీలో చురుకుగా తిప్పుతూ యువజన విభాగం అధ్యక్ష పదవి వరకు ఎదిగేలా చేశారు. కానీ పార్టీ నాయకులు మాత్రం ఆయనకు పార్టీలో స ముచితం స్థానం ఇవ్వకపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం కొత్తదారిలో వెళ్లుతున్నట్లు అంతర్గత సంభాషణలో అనుచరులు పేర్కొం టున్నారు. ఆయన తరువాత ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్ నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నాయకులతో పాటు, మాజీ కార్పొరేటర్లు పార్టీ గుడ్‌బై చెప్పే చాన్స్ ఉందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News