Tuesday, April 30, 2024

రెవిన్యూ సదస్సుల నిర్వహణపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Video Conference with District Collectors

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, ఇతర రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌ లపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సిఎస్ తెలిపారు. ఈ రెవిన్యూ సదస్సులలో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 11న సిఎం కెసిఆర్ నిర్వహించనున్నకలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు అన్ని సమగ్ర సమాచారంతో రావాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News