Thursday, May 2, 2024

పరిస్థితి అదుపులోనే ఉంది: సిపి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Cyberabad CP Sajjanar inspecting Lakes

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెరువుల వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని సిపి విసి సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్‌తో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హిమయత్‌సాగర్, పల్లెచెరువు, అప్పాచెరువు, మిగతా వాటిని శుక్రవారం పరిశీలించారు. అన్ని చెరువుల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని సిపి విసి సజ్జనార్ తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని, తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టాలని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసరం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు. సిపి వెంట శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి విశ్వప్రసాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, ఇన్స్‌స్పెక్టర్లు కనకయ్య, నర్సింహులు, శ్యాంసుందర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News