Sunday, April 28, 2024

పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cyberabad police have arrested an interstate thieves

హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి వస్తువులు, మూడు రాడో వాచ్‌లు, బంగారం కరిగించే కిట్టు, వేయింగ్ మిషన్, రూ.30,000 నగదు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం,మోరాదాబాద్, మంజాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఫహీం అలియాస్ ఎటిఎం అలియాస్ ఫహీం అహ్మద్ అలియాస్ ఫహీంఉద్దిన్ గ్లాస్ వర్క్ చేసేవాడు. యూపి, అమ్రోహ జిల్లాకు చెందిన ముర్‌సలీం గుర్‌గావ్‌లో నివాసం ఉంటున్నాడు. మరో నిందితుడు ఆరిఫ్ పరారీలో ఉన్నాడు.

ఫహీం స్థానికంగా పలువురితో గొడవులు పడడం, దాడులు చేయడం చేసేవాడు. నిత్యం గొడవలు పడుతు గ్యాంగ్ స్టర్‌గా ఎదిగాడు. కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు వంటి నేరాలు చేయడంతో 2013లో మురాదాబాద్ పోలీసులు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలులోనే ముర్‌సలీంతో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్స్‌లో పదో నంబర్ వాడు. ఇతడు పలు నేరాలు చేయడంతో యూపి పోలీసులు ఇతడి ఆస్థులను సీజ్ చేశారు. నిందితులు ముగ్గురు కలిసి 2017 నుంచి గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, ఎపి, తెలంగాణలో నేరాలు చేశారు. నిందితులు ముగ్గురు కలిసి బలానో కారులో నగరానికి వచ్చి అల్వాల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు చేశారు. 2017లో చందానగర్ పిఎస్ పరిధిలో మూడు చోరీలు, 2018లో రాయదుర్గం పిఎస్ ఒకటి, సంఘారెడ్డి అమీన్‌పూర్ పిఎస్ పరిధిలో ఒక చోరీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. బాలానగర్ డిసిపి పద్మజా, ఎస్‌ఓటి ఎడిసిపి సందీప్ పర్యవేక్షణలో ఎస్‌ఓటి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

వరుసగా నేరాలు…

నిందితుడు కారులో బయలుదేరి గూగుల్ మ్యాప్ ద్వారా వస్తుంటాడు. స్థానికంగా ఉన్న రాష్ట్రాల నంబర్ ప్లేట్‌ను కారుకు పెట్టుకుని నగర శివారులోని కాలనీల్లో చోరీలు చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లల్లో ఖరీదైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేస్తున్నారు. వరుసగా చోరీలు చేస్తూ రాష్ట్రాలను దాటి వెళ్లేవారు. పోలీసులు అడ్డు వస్తే గన్స్‌తో కాల్చేందుకు తమ వెంట రెండు గన్స్‌ను కూడా ఉంచుకున్నారు. చోరీ చేసిన సొత్తును వేరే వారికి అలాగే విక్రయిస్తే పోలీసులకు పట్టుబడతామని అతడే బంగారాన్ని కరిగించే సామగ్రిని, బరువును కొలిచే మిషన్‌ను కొనుగోలు చేశాడు. బంగారాన్ని కరిగించి విక్రయించేవాడు. వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. నిందితుడని ఢిల్లీలోని విల్లాలో అరెస్టు చేశారు. చోరీ చేసిన డబ్బులతో నిందితుడు ఢిల్లీలో విల్లాను కొనుగోలు చేశాడు.

పదిహేను రోజులు….

గ్యాంగ్ స్టర్ ఫహీంను పట్టుకునేందుకు బాలానగర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ రమణారెడ్డి పర్యవేక్షణలో ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై సంజీవ్ తదితరులు పదిహేను రోజులు గుర్‌గావ్‌లో గాలించారు. నిందితులు నేరాలు చేసిన ప్రాంతంలో వదిలిన సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతో ముఠాను పట్టుకునేందుకు వెళ్లి అక్కడే మకాం వేశారు. నిందితుడు ఉన్న విల్లాను కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కాల్పులు జరిపేందుకు కూడా వెనుకాడే వారు కాకపోవడంతో జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News