Tuesday, April 30, 2024

మూడు దశల్లో సైక్లింగ్ ట్రాక్‌లు

- Advertisement -
- Advertisement -

Cycling Tracks in City As Part of Smart City

స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్‌లో అమలు

హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్షంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో నలుమూలాల ప్లై ఓవర్లు, అండర్ గ్రౌండ్ మార్గాలతో పాటు ప్రధాన రహదారులతో లింక్ రోడ్ల అనుసంధానం ప్రక్రియతో నగరవాసుల ప్రయాణం సాఫీగా సాగుతోంది. అంతేకాకుండా భాగ్యనగరానికే మణిహారంగా మారబోతున్న దుర్గం చెరువు తీగల వంతెనకు అదనంగా జిహెచ్‌ఎంసి సైక్లిలింగ్ ట్రాక్‌లకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా ఇండియా సైకిల్ 4 చేంజ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని బల్దియా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగా ఖైరతాబాద్‌జోన్‌లో ఈ కార్యక్రమాన్ని  అమలు చేయనున్నది. సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీ కింద రిజిస్టర్ అయిన 95 నగరాల్లో హైదరాబాద్ కూడా ఎంపిక కావడంతో గ్రేటర్ పరిధిలో ఇండియా సైకిల్ 4 చేంజ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని మెట్రో పాలిటన్ డెవలఫ్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారటీ (హెచ్‌యుఎంటిఎ)ల సాంకేతిక, సలహాలు సూచనలతో అమలు చేయనుంది. ఫైలెట్ ప్రాజెక్ట్ కింద సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్ పరిధిలో సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ఈ మూడు సంస్థలు కలిసి ప్రణాళిక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23కిలో మీటర్ల పొడవునా 7సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను ఓకే చేశారు. ఇందులో ముందుగా 10కిలో మీటర్ల చోప్పున రోడ్డుకు ఇరువైపులా కలిపి(20)కిలో మీటర్లు మేర సైకిల్ కారిడార్లను రూపొందించనున్నారు.

ఈకారిడార్ వినియోగంలోకి వచ్చిన తర్వాత అందే సలహాలు, సూచనలు (ఫీడ్‌బ్యాక్) మేరకు మార్పులు, చేర్పులతో ఇతర ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సైక్లిస్టుల భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సహాయ సహకారం తీసుకోనున్నారు అదేవిధంగా పబ్లిక్ బైక్ షేరింగ్ డాక్స్ (పాయింట్స్)గా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎంఎంటిఎస్‌ల స్థలాను మొదటి, చివరి కనెక్టివిటీగా సెంట్రర్లుగా వినియోంచికుకోవాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా రోడ్ మార్కింగ్‌లు, ప్లగ్ అండ్ ప్లే బోల్లర్డ్ వంటి తాత్కాలిక బారికేడ్స్, సైనేజెస్లను ఏర్పాటు చేస్తున్నారు.

మూడు దశల్లో 450 కిలో మీటర్ల మేర సైక్లిలింగ్ ట్రాక్‌లు

పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా 20 కిలో మీటర్ల మేర సైక్లిలింగ్ ఏర్పాటు చేయనున్న జిహెచ్‌ఎంసి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల మేమరకు రెండు, మూడు దశల్లో మొత్తం 450 కిలోమీటర్ల మేర సైక్లిలింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. కొవిడ్ 19 నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో సైక్లిలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడం ఎంతో ఉప యుక్తంగా ఉండనుందని, ఇది ప్రజా రవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాగలదని నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మొదటి దశ కింద సైక్లిలింగ్ ట్రాక్‌లను అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ది వ్యవహారాల శాఖ రానున్న అక్టోబర్ 14వరకు గడువును విధించింది. ఈ ప్రాజెక్టు కింద ఎంపికై న 95 నగరాల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ అధారంగా రెండవ దశలో అక్టోబర్ 28న 11 నగరాలను ఎంపిక చేయనుంది. ఎంపికైన 11 నగరాలకు రూ.కోటి చోప్పున నగదు అవార్డును సైతం అందించనుంది. ఈ 11 నగరాలకు అంతర్జాతీయ నిపుణులు సంప్రదింపులు, సలహాలను అందించున్నారు. మూడో దశ కింద పూర్తిస్థాయలో సన్నద్దం అయ్యేందుకు 2011 మే 31వ తేదీని తూది గడువుగా నిర్ణయిచింది.

నగరంలో ఇప్పటికే సైక్లింగ్ ట్రాక్‌లు

నగరంలో మెట్రో రైలు నిర్మాణం ప్రారంభం కాలంలోనే సైక్లిలింగ్ ట్రాక్‌లకు జిహెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో అప్పట్లోనే ప్రత్యేకంగా సైక్లిలింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో సైకిళ్ల పార్కింగ్‌కు సైతం ప్రత్యేక స్థలం కేటాయించడమే కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మెట్రో రైలు ప్రధాన మార్గాల గుండా వెళ్లతుండడంతో మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలకునే చుట్టు పక్క ప్రాంతా వాసులు ఆయా స్టేషన్ల వరకు సైకిళ్లపై చేరుకుని తర్వాత తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు అనువుగా సైక్లిలింగ్ ట్రాక్‌ల ఏర్పాటు చేశారు. అయితే నిర్ధేశించిన కాల వ్యవధిలో పూర్తి కాకపోవడం, ఆందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి సైతం స్పందన పెద్దగా రాలేదు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ విధానంతో నగరంలో మళ్లీ సౌసైక్లిలింగ్‌ల ట్రాక్‌లను ఏర్పాటుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News