Friday, June 9, 2023

మోచా తుఫాను బలపడి బంగ్లాదేశ్‌-మయాన్మార్ తీరం వైపు కదులనున్నది!

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని, ఈ వారంలో బంగ్లాదేశ్‌-మయన్మార్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) సోమవారం తెలిపింది. అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి అల్పపీడనంగా కేంద్రీకృతమై మరుసటి రోజు తుఫానుగా మారుతుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర విలేకరులకు తెలిపారని పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. మత్సకారులు, ఓడలు, ట్రాలర్లు, చిన్న పడవలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న వారు తీరానికి తిరిగి రావాలని కోరారు.

500 సంవత్సరాల క్రితం ప్రపంచానికి కాఫీని పరిచయం చేసిన ఎర్ర సముద్రపు ఓడరేవు నగరం పేరిట యెమన్ సూచించిన ఈ తుఫానుకు మోచా(మోఖా) అన్న పేరు పెట్టారు. ‘తుఫాను మొదట్లో ఉత్తరవాయువ్య దిశగా మే 11 వరకు మధ్య బంగాళాఖాతం వరకు కదులుతుంది, ఆపై తిరిగి వంపు తిరిగి బంగ్లాదేశ్‌మయన్మార్ తీరం వైపు ఉత్తరఈశాన్య దిశగా కదులుతుంది’ అని మృత్యుంజయ్ మహాపాత్ర అన్నట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది.

మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 50 60 నుంచి 70 కిమీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మహాపాత్ర తెలిపారు. మంగళవారం అండమాన్ అండ్ నికోబార్ దీవులలో భారీ వానలు పడనున్నాయని కూడా ఆయన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News