Sunday, April 28, 2024

64ఏళ్ల తర్వాత దలైలామాకు రామన్ మెగసెసే పురస్కారం అందజేత

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసే పురస్కారం 64ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా బుధవారం అందుకున్నారు. ఫౌండేషన్ సభ్యులు వ్యక్తిగతంగా పురస్కారాన్ని దలైలామా నివాసంలో అందజేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఫిలిప్పీన్స్‌లోని రామన్ మెగసెసే అవార్డు సభ్యులు ఈ పురస్కారాన్ని అందించారు. టిబెటన్ కమ్యూనిటీ పవిత్ర మతాన్ని రక్షించడంలో దీటైన పోరాటానికి గుర్తింపుగా దలైలామాకు ఈ పురస్కారం అందించినట్లు దలైలామా కార్యాలయం తెలిపింది. రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుసున్నా బి అఫాన్, ఫౌండేషన్ ట్రస్టీ ఎమిలీ ఎ అబ్రేరా మెగసెసే పురస్కారాన్ని వ్యక్తిగతంగా అందించడానికి దలైలామాతో సమావేశమైనట్లు తెలిపారు.

Also Read: ఆపరేషన్ కావేరీ… సూడాన్ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది

కాగా దలైలామా అన్నయ్య గయాలో థోండెన్ ఆగస్టు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఆయన తరఫున పురస్కారాన్ని అందుకున్నారు. దలైలామా 1959లో టిబెట్‌ను విడిచిపెట్టి అప్పటి నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు. రామన్ మెగసెసే పురస్కారాన్ని ఆసియా నోబెల్ బహుమతిగా పిలుస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పాలన దక్షతకు గుర్తింపుగా ఆయన పేరిట ఈ వార్షిక అవార్డును ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సమ్మతితో న్యూయార్క్ నగరంలోని రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ధర్మకర్తలుగా 1957లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News