Monday, April 29, 2024

13 ఏళ్ల తర్వాత సిక్కింని సందర్శించిన దలైలామా

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌టక్ : టిబెటన్ ఆధ్యాత్మిక గురువు, 14 వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో 13 ఏళ్ల తర్వాత సిక్కింను సందర్శించారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. తూర్పు సిక్కిం లోని లిబింగ్ ఆర్మీ హెలిప్యాడ్ వద్ద ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ నుంచి దిగిన ఆయనకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ స్వాగతం పలికారు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన నాధులాకు 50కిమీ దూరంలో ఉన్న గ్యాంగ్‌టక్ లోని పాల్జోర్ స్టేడియంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బౌద్ధ ప్రార్థనలు,

బోధనలు నిర్వహిస్తారు. 37 బోధిసత్వ సాధనాలపై బోధనలు చేయనున్నారు. సుమారు 40 వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. సిమ్మిక్ ఖమ్‌డాంగ్ నియోజకవర్గంలో రుమ్‌టెక్ , గ్యాల్వా లాట్‌సున్‌చెన్‌పో విగ్రహం వద్ద కర్మప పార్క్ ప్రాజెక్టుకు దలైలామా వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం పశ్చిమబెంగాల్ సిలిగురి లోని సాలుగరాకు వెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News