Wednesday, May 8, 2024

అగ్ర కులం అమ్మాయితో దళితుడు పారిపోయాడని…. యువకుడి సోదరుడిని నరికి నరికి…

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: అగ్ర కులానికి చెందిన అమ్మాయితో దళిత యువకుడు పారిపోవడంతో ఆ యువకుడి సోదరుని అమ్మాయి కుటుంబ సభ్యులు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖందాళా గ్రామంలో మాలి కులానికి చెందిన దేవిదాస్ చగాన్ దియోకర్(47)కు కూతురు ప్రియా ఉంది. ప్రియా అనే అమ్మాయి గత రెండు సంవత్సరాల నుంచి ఎస్‌టి కులానికి చెందిన అమోల్ గైక్వాడ్‌ను ప్రేమిస్తోంది. అమోల్ ఇంటర్ వరకు చదివి చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ప్రియా బిఇడి పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తోంది. మార్చి-12న ప్రియా దియోకర్ కనిపించకపోవడంతో తండ్రి దేవిదాస్ వైజాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మార్చి-13న తన కుమారుడు ఆమోల్ కనిపించడంలేదని అతడి తలిదండ్రులు కూడా ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కలిసి లేచిపోయారని దేవిదాస్ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం పగ తీర్చుకోవాలనుకున్నాడు. మార్చి-14 రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమోల్ సోదరుడు భిమ్‌రాజ్ గైక్వాడ్ కనిపించడంతో దేవిదాస్, ఆయన సోదరుడు రోహిదాస్ పదునైన ఆయుధాలతో  అతడిపై దాడి చేశారు. దీంతో ఘటనా స్థలంలో భిమ్‌రాజ్ చనిపోయాడు. ఎస్‌ఐ కులకర్ణి, తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దేవిదాస్, రోహిదాస్‌ను అరెస్టు చేశారు. ఖందాళా గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

Dalit teen Murdered,Brother elope upper caste woman,Devidas and Rohidas confronted Bhimraj gaikwad, accused attack on boy with sharp weapon

 

Dalit teen Murdered,Brother elope upper caste woman
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News