Thursday, September 25, 2025

డల్లాస్‌లో ఇమిగ్రేషన్ ఆఫీసు వద్ద కాల్పుల మోత.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

డల్లాస్ ః అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర డల్లాస్ నగరంలోని ఇమిగ్రేస్ కార్యాలయం వద్ద బుధవారం ఓ సాయుధుడు అరాచక రీతిలో కాల్పులకు దిగాడు. కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. పలువురు గాయపడ్డారు. ఆ తరువాత సమీపంలోని బిల్డింగ్ వద్ద దుండగుడు తూటాల గాయాలతో మృతి చెంది ఉండగా గుర్తించారు. ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి చికిత్సకు తరలించారని పోలీసు విభాగం ఓ ప్రకటన వెలువరించింది.

ఆగంతకుడు ఇక్కడ బాగా ట్రాఫిక్ ప్రాంతంలో ఉండే ఇమిగ్రేషన్ (ఐసిఇ) కార్యాలయం వద్దనే కాపు కాసి అక్కడికి వచ్చిన వారిపై కాల్పులకు దిగాడు. వెంటనే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అగ్నిమాపకశకటాలు, పోలీసు వ్యాన్లు తరలివచ్చాయి. చాలా సేపటి వరకూ ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడింది. సమీప భవనంపై నుంచి దుండగుడు అరాచకానికి దిగినట్లు ప్రాధమికంగా వెల్లడైంది. ఇక్కడి ఘటనను అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ ఖండించారు. చట్టపరమైన సంస్థల వద్ద ఇటువంటి దాడులకు దిగడం, భయోత్పాతాన్ని కల్పించడం గర్హనీయం అని వ్యాఖ్యానించారు. వ్యక్తి అరాచకానికి కారణాలను ఆరాతీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News