Saturday, May 4, 2024

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని తప్పులు లేకుండా చూడాలి: కమిషనర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిటీ బ్యూరో: ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ని తప్పులు లేకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ ఖైరతాబాద్ జోన్ కార్యాలయం లో డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… డేటా ఎంట్రీ లో తప్పుల లేకుండా పాదర్శకంగా ఎంట్రీ చేయాలని తెలిపారు. ఒక్కొక్క దరఖాస్తు ఎంత సమయం పడుతుంది అని ఆపరేటర్ ను అడిగి తెలుసుకున్నారు.

రోజుకు కేటాయించిన కంటే ఎక్కువ గా డేటా ఎంట్రీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ డేటా ఎంట్రీ చేసిన అప్లికేషన్ స్వయంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఐటీ స్నేహ శబరిష్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రె తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కమిషనర్ ప్రజా భవన్ కు వెళ్లి ప్రజావాణి నోడల్ అధికారి మున్సిపల్ శాఖ సి.ఎం.డి.ఏ దివ్య తో కలిసి ప్రజావాణి ఏర్పాట్లను పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News