Wednesday, May 8, 2024

అబద్దాల ప్రచారానికే రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : రాష్ట్రంలో అబద్దాల ప్రచారానికే సిఎం కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు చేశారని, ఈ తొమ్మిదిన్నరేళ్ల సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి వందేళ్ల విధ్వంసం జరిగిందని పిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా విమర్శించారు. భూపాలపల్లి పట్టణంలో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గండ్ర సత్యనారాయణరావు భారీ ర్యాలీతో వెళ్ళారు.

ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్‌రెడ్డి, పిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్‌లో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకే సిఎం కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ నిరసనలో పిసిసి సభ్యులు చల్లూరి మధు, ఎస్‌టి సెల్ జిల్లా చైర్మన్ పోరిక సమ్మయ్య నాయక్, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ గుమ్మడి శ్రీదేవి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రెసిడెంట్ బట్టు కరుణాకర్, టౌన్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రూరల్ ప్రెసిడెంట్ సుంకరి రామచంద్రయ్య, టౌన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News