Sunday, April 28, 2024

ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధి కోసం రూ. 1.30 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -
  • జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల అభివృద్ది కోసం మరో రూ.1.30కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఎంపిపి కృపేష్ అధ్యక్షతన జరిగిన మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతితో నియోజకవర్గంలోని పల్లెలు అభివృద్ధి పథంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులను ఎంపిక చేయడం గర్వకారణమని అన్నారు. గతంలో డిఎంఎఫ్ కింద రూ.10 కోట్లు, ఎస్‌డిఎం కింద రూ,10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. నూతనంగా మరో రూ.1.30 కోట్లు మంజూరు చేయడంతో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు నిధును సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

గత రెండు మాసాల క్రితం రూ.20 కోట్ల రూపాయలను అండర్ డ్రైనేజీ, రోడ్లకు మరమ్మతుల కోసం వినియోగించాలని ఆయన అధికారులను కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా 10,160 ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది కొంగర కలాన్‌లో మే నాటికి ఫ్యాక్స్‌కాన్ కంపనీ పూర్తవుతుందని అందులో ఈ ప్రాంతానికి చెందిన మహిళలతోపాటు పురుషులకు సుమా రు 1500 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. అలాగే ఎంకెఆర్ ఫౌండేషన్ ద్వారా సుమారు 1100 మంది నిరుద్యోగ యువత జాబ్ పొందడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా గృహాలక్ష్మీ కింద మహిళల పేరు మీద 3 వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. రెండవ విడత దళితబంధు పథకంలో నియోజకవర్గంలోని 1100 మందికి మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ నిచ్చారు. అనంతరం 19 అంశాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు.

ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా 30 గ్రంథాలయాలు ఏర్పాటు: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.వి రమణారెడ్డి

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముందుచూపుతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ఉందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.వి రమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 30 గ్రంథాలయాలను ప్రారంభించడం గర్వంగా ఉందని చెప్పారు. అలాగే మండలంలోని పోచారం, దండుమైలారంలో లైబరీలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఉప్పరిగూడ రోడ్డు గుండా 11 కెవి లైన్లు ఏర్పాటు చేయాలి: సర్పంచ్ బూడిద రాంరెడ్డి

చెరువు గుండాఉప్పరిగూడ గ్రామానికి 11 కేవి విద్యుత్ లైన్ పూర్తిగా పెద్ద చెరువు నీటిలో నుండి ఉన్నందున రోడ్డు వెంట వేయాలని సర్పంచ్ బూడిద రాంరెడ్డి ఎమ్మెల్యేకు వివరించడంతో వెంటనే ఏఈ శ్రీనివాస్‌రావుకు ఆదేశాలు జారీ చేయడంతో ఏఈ స్పందించి పెద్ద లైన్ వైర్లను రోడ్డు గుండా ఏర్పాటు చేస్తానని ఆయన హామీ నిచ్చారు.

ఎలక్ట్రిసిటీ అధికారులను అభినంధించిన ఎమ్మెల్యే

సాధారణ సర్వసభ సమావేశంలో మొదటిసారిగా మండల వారిగా ఏ గ్రామంలో ఏ పనులు చేశామో లిస్టు ఇవ్వడంతో అటు ఎమ్మెల్యేకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించడంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఏఈ శ్రీనివాస్‌రావు, ఇతర అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మండల వైఎస్ ఎంపిపి ప్రతాప్‌రెడ్డి,పిఏసిఎస్ చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డి, మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షులు ఏనుగు భరత్‌రెడ్డి , డిఈ శ్రీనివాస్‌రెడ్డి, డిపో మేనేజర్ అశోక్‌రాజు, పంచాయతీ ఏఈ ఇంద్రాసేనారెడ్డి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, ఏఓ వరప్రసాద్, మండల ఇన్‌చార్జీ ఎండిఓ క్రాంతి కిరణ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు రవిందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News