Sunday, April 28, 2024

గ్రామాల్లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టే గిరిజన ఉత్సవం, పల్లె ప్రగతి దినోత్సవం, హరితహారం, మంచినీళ్ల పండుగ వంటి కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక మండల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఐ.డి.ఓ.సి నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో కలసి మండల అధికారులతో సామవారం సాయంత్రం మాట్లాడారు. మంచినీళ్ల పండుగపై మాట్లాడుతూ.. మరిపెడ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ పథకంపై అవగాహన పెంచేందుకు గ్రామాల నుంచి రెండు బస్సుల ద్వారా ఎంపిక చేసిన వారిని తరలించాలని ఆదేశించారు.

ప్రల్లె ప్రగతి కార్యక్రమం రంగవల్లులతో మామిడి తోరణాలతో ఆడపడుచులు ముగ్గులతో అందంగా అలంకరించాలని అన్నారు. గిరిజనులకు కరపత్రాల ద్వారా సాధించిన ప్రగతిని తెలియపర్చాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయితీలకు భవనాలు మంజూరైనందున శంకుస్థాపనలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ఉత్సవంలో కుల పెద్దలను ఆహ్వానించి సన్మానించుకోవాలన్నారు. అలాగే సాంకృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తెలంగాణ హరితోత్సవం కార్యక్రమాన్ని అటవీశాక అధికారులు చేపట్టాలన్నారు. 8 విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని ప్రస్తుతం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు.

ఎనిమిది సంవత్సరాలుగా నాటిన మొక్కల వివరాలను సంరక్షింపబడ్డ మొక్కల వివరాలను ఫ్లెక్సీల ద్వారా వివరించాలని సూచించారు. అర్భన్ పార్క్ ప్రగతినిపై ప్రచారం అవసరమని అదనంగా చేపట్టాల్సిన పార్కులపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎం. డేవిడ్, శిక్షణ కలెక్టర్ పింకేష్ కముఆర్, ఫారెస్టు అధికారి కృష్ణమాచారి, ఆర్డివో డి. కొమురయ్య, జెడ్పీ సీఈవో రమాదేవి, డిపివో నర్మద, మున్సిపల్ కమీషనర్ కట్టంగూరి ప్రసన్నరాణి, నోడల్ అధికారి సూర్యనారాయణ, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News