Monday, September 22, 2025

కులగణనతో అణగారిన వర్గాలకు న్యాయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కులగణన నిర్ణయం అణగారిన వర్గాల న్యాయానికి తొలిమెట్టు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లు జరుగుతుండటంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కులగణనపై నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏ సమాజానికి అయినా సామాజిక, ఆర్థిక ఆరోగ్యం తెలియకుండా సరైన ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని అన్నారు. దేశ అభివృద్దిలో ప్రతి వర్గానికి సమానమైన భాగస్వామ్యం ఉండేలా చూడడానికి కులగణన ఒక్కటే ఏకైక మార్గమని రాహుల్ అభిప్రాయ పడ్డారు. న్యాయం దిశగా తొలి అడుగు వేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News