Sunday, April 28, 2024

రష్యాలో తగ్గుతున్న రోజువారీ కేసులు, పెరిగిన మరణాలు..!

- Advertisement -
- Advertisement -

Declining daily Corona cases in Russia

 

మాస్కో: రష్యాలో ఒకే రోజు కోవిడ్19 వల్ల ౩541మంది మృతి చెందారు. క్రితంరోజుకన్నా ఇది 153 అధికం. గతంలోకన్నా ఇది రికార్డు. గత రికార్డు 150. అయితే, కొత్త కేసుల విషయంలో ఇటీవలి రోజులతో పోలిస్తే తక్కువగా నమోదు కావడం గమనార్హం. తాజాగా ఒకే రోజు నమోదైంది 8599 కేసులు. ఈ వివరాల్ని రష్యా జాతీయ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ ఆదివారం వెల్లడించింది. ఈ నెలలో చాలావరకు రోజుకు 11,000కుపైగా కరోనా కేసులు రష్యాలో నమోదైన విషయం తెలిసిందే. రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 3,44,481. రష్యాలో కేసులు అధికంగా నమోదవుతుండగా, మరణాలు తక్కువ సంఖ్యలోనే ఉండటం పట్ల కొందరికి అనుమానాలున్నాయి. అయితే, మరణాల సంఖ్యను తక్కువ చేసి చెబుతున్నారన్న విమర్శల్ని రష్యా అధికారులు ఖండించారు. పౌరుల ఆరోగ్య రక్షణ కోసం తాము తీసుకుంటున్న చర్యల వల్లే మరణాల రేట్ తక్కువగా ఉన్నదని వారు వివరణ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News