Saturday, May 4, 2024

రేపటి నుంచి తెరుచుకోనున్న చెన్నై పారిశ్రామిక వాడలు

- Advertisement -
- Advertisement -

Government approves the launch of industrial products in Chennai

 

చెన్నై: ఆంక్షల సడలింపులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని 17 పారిశ్రామిక ప్రాంతాల్లో ఉత్పత్తుల ప్రారంభానికి అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరంలాంటి జాగ్రత్తలు పాటిస్తూ సోమవారం నుంచి 25 శాతం కార్మికులతో పనులకు అంగీకారం తెలిపింది. రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత చెన్నైలోని పారిశ్రామిక వాడల్లో ఉత్పత్తుల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాన్ కంటైన్‌మెంట్ జోన్లలోని అంబత్తూరు, గ్విండీలాంటి ప్రాంతాల్లోని పరిశ్రమలకు అనుమతిచ్చింది. కాగా, కంటైన్‌మెంట్లలో నివాసముండే కార్మికులను ఇప్పుడే రానివ్వొద్దని తెలిపింది. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ పరీక్షించిన తర్వాతే పనికి అనుమతించాలని ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News