Saturday, May 4, 2024

విపత్తు తక్షణ సహాయక చర్యలపై డిఆర్‌ఎఫ్ ప్రత్యేక శిక్షణ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: విపత్తు ఏదైనా అత్యవసర సమాయాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు దీటుగా తక్షణమే సహాయక చర్యలను అందిస్తూ అందరి మన్నలను పొందుతున్న జిహెచ్‌ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్) ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. కోటిపై చిలుకు జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలాంటి విపత్తు సంభవించిన వెంటనే సహాయక చర్యలను అందించేందుకు ప్రత్యేక ఫోర్స్ ఉండాలన్న పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆలోచనలో నుంచి 2019లో పురుడు పోసుకుంది. ఇవిడిఎం విభాగం. ఈ విభాగం ఆధ్వర్యంలో చరుకైన యువకులను ఎంపిక చేసి వారికి ఏ విపత్తు ఏదైనా సహాయక చర్యలను అందించే విధంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రత్యేకంగా డిఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఇవిడిఎం ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా 27 బృందాలు పని చేస్తుండగా మరో 3 బృందాలు త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇదేక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే గ్రేడ్ 1,2,3. మున్సిపాల్టీలో సైతం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్న మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఆయా మున్సిపాల్ కార్పొరేషన్స్, మున్సిపాలటీలతో పాటు పోలీసు సిబ్బందికి నాగోల్ ఫత్తుల్లాగూడలోని డిఆర్‌ఎఫ్ శిక్షణ కేంద్రంలో శిక్షణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మార్గదర్శకత్వం, జిహెచ్‌ఎంసి కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, సిడిఎంఎన్. సత్యనారాయణ సూచనలకు అనుగుణంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ ఆధ్వర్యంలో ఆయా మున్సిపాలిటీల సిబ్బందికి గత మే 8వ తేదీ నుంచి జూన్ 24 వరకు వారం రోజుల చొప్పున మొత్తం 257 మందికి శిక్షణ ఇవ్వడంతో ద్వారా వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.

ఫతుల్లాగూడ డిటిసి (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్)లో ఆయా మున్సిపాలిటీలో ఏలాంటి విపత్తు సంభవించినా స్వయంగా స్థానిక సిబ్బంది, జిల్లా అధికారులు స్వయంగా అత్యవసర సహాయక చర్యలు అందించే విధంగా ఈ శిక్షణను ఇచ్చారు. ఇందులో ప్రజా ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్షంగా శిక్షణ ఇచ్చారు. పట్టణాల్లో వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు సంభవించిన సమయాల్లో అందించాల్సిన సహాయ చర్యలతో పాటు భవనం కూలిపోయినప్పుడు ప్రజలను రక్షించడం శిథిలాలను తొలగించడంతో పాటు వరద నీరు నిలవడం, చెట్లు కూలినప్పుడు చేపట్టిన రెస్కూ ఆఫరేషన్ల విధానాలు, మండలను ఆర్పే పద్ధ్దతులు, బేసిక్ యంత్రాలు, పరికరాల వినియోగం నిర్వహణతో పాటు కూల్చివేత, కట్టింగ్ గేర్‌లపై ప్రాక్టికల్ డెమోల ద్వారా సమగ్ర శిక్షణను ఇచ్చారు.

అదేవిధంగా డిజాస్టార్ బృందాల వద్ద 24 గంటలపాటు వెంట ఉంచుకోవాల్సిన యంత్రాలు, సామగ్రి జాబితాను సవివరంగా వివరించారు. అదేవిధఃగా ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ విధానంలో భాగంగా సిపిఆర్ చేయడం, ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణను ఇచ్చారు. అంతేకాకుండా అతిముఖ్యమైన డిఆర్‌ఎఫ్ బృందాల్లో పని చేసే సిబ్బంది శారీకంగా ఎప్పుడు ఫిట్‌గా ఉండేలా శారీరక శిక్షణ తో యోగా ద్వారా ఎలాంటి పరిస్థితులోనైన సహాయక చర్యలను అందించేవిధంగా వారిని తీర్చిదిద్దారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News