Tuesday, April 30, 2024

టిటిడి ఆస్తులను విక్రయించే అధికారం… జగన్ సర్కార్‌కు ఎక్కడిది?

- Advertisement -
- Advertisement -

Bandi sanjay comments on assets of TTD

 

నిలదీసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుమల, తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆస్తులను విక్రయించే అధికారం జగన్ సర్కార్‌కు లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హిందూ ధర్మం, హిందూవుల ఆలయాలను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఎపిలోని జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏడుకొండల స్వామితో పెట్టుకున్న వారు బతికి బయడపడిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి హిందూవుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే వారిని దేశం నుంచి తరమికొట్టే రోజులు వస్తాయన్నారు. టిటిడి ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి, పాస్టర్ల జీతాలకు జగన్ సర్కార్ ఇవ్వాలనుకుంటున్నదా? ఆదివారం విడుగల చేసిన ఒక పత్రికా ప్రకటనలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా టిటిడిఆస్తులను అమ్మాలనుకునే జగన్ సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే శ్రీవారి భక్తులతో పాటు హిందూ బంధువులంతా సంఘటితంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా- బండి సంజయ్ హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News