Thursday, May 2, 2024

కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కార్

- Advertisement -
- Advertisement -

Delhi CM announces Rs 50K ex gratia each to families

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఢిల్లీలో మొత్తం 72 లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వారికి ప్రతి నెలా 5 కిలోల రేషన్ ఇస్తారు. ఈ నెలలో రేషన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది కాకుండా, 5 కిలోల ఉచిత రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. కాబట్టి వారికి ఈ నెలలో 10 కిలోల ఉచిత రేషన్ ఇస్తున్నారని సిఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 50వేలు ఆర్థిక సాయం ఇవ్వనుంది. కరోనాతో ఇంటిపెద్ద చనిపోయిన కుటుంబానికి నెలకు రూ.2500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అనాథలైన పిల్లలకు 25 ఏళ్లు వచ్చేవరకు పింఛనుతో పాటు ఉచిత విద్య, అవివాహితులు చనిపోతే తల్లిదండ్రులకు పరిహారం, పింఛన్, ఇవ్వనున్నట్టు ఢిల్లీ సిఎం వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News