Thursday, May 2, 2024

దీప్ సిద్దూను ఎర్రకోట వద్దకు తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఎర్రకోట వద్దకు దీప్ సిద్దూను
తీసుకెళ్లిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు
సీన్ రీ కన్‌స్టక్షన్ చేసిన అధికారులు

Delhi police to bring deep sidhu for case re instruction

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అరెస్టు చేసిన దీప్‌సిద్ధూ, మరో నిందితుడు ఇక్బాల్ సింగ్‌ను ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు శనివారం ఎర్రకోట వద్దకు తీసుకెళ్లారు. చారిత్రక కట్టడం వద్ద ఆ రోజు జరిగిన సంఘటనలను పునః సృష్టి(రీ కన్‌స్ట్రక్షన్) చేశారు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో 500 మందికి పైగా పోలీసులు గాయపడగా, ఒక వ్యక్తి మృతి చెందాడు. నటుడైన దీప్ సిద్ధూ ఈహింసలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల బృందం గత సోమవారం హర్యానాలోని కర్నాల్ బైపాస్ వద్ద ఆయనను అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టులో హాజరు పర్చగా ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. రూ.50 వేల రివార్డు ఉన్న ఇక్బాల్ సింగ్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో అరెస్టు చేశారు. రిపబ్లిక్ డేనాటి హింస గురించి పోలీసులు ఈ ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనలకు సంబంధించి మరి కొందరు నిందితులను పట్టుకోవడానికి పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.

Delhi police to bring deep sidhu for case re instruction

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News