Monday, May 13, 2024

హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

క్లిష్టమైన పిచ్‌పై అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన భారత ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై రోహిత్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగి పోవడాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు కొనియాడారు. గింగిరాలు తిరుగుతున్న బంతులను అలవోకగా బౌండరీలకు తరలించిన తీరును పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రోహిత్ చేసిన బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనని వివిఎస్. లక్ష్మణ్, హర్భజన్ సింగ్, మంజ్రేకర్, గవాస్కర్, సురేశ్ రైనా తదితరులు పేర్కొన్నారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన సత్తా ఏంటో మరోసారి రోహిత్ చూపించాడని వారు ప్రశంసించారు. ఇక చాలా రోజుల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన భారత అభిమానులు కూడా రోహిత్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయి పోయారు. అభిమానులు కేరింతలు కొడుతూ రోహిత్‌ను ఉత్సాహ పరిచారు. ఇక వైస్ కెప్టెన్ రహానె ఇన్నింగ్స్‌పై కూడా ప్రశంసలు కురిసాయి. రోహిత్‌కు అండగా నిలిచి అతను జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించాడని పలువురు మాజీ క్రికెటర్లు రహానెను ప్రశంసించారు.

Ex Cricketers Praise on Rohit Sharma hits ton against Eng

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News