Tuesday, April 30, 2024

బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి

- Advertisement -
- Advertisement -

అబిడ్స్ ఎస్‌బిఐ ముందు సిపిఎం నిరనన

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్లు వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆబిడ్స్‌లోని గన్ ఫౌండ్రీ ఎస్‌బిఐ బ్యాంక్ కార్యాలయం ముందు సిపిఎం ఆందోళన నిర్వహించింది. సోమవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అవినీతిని కాపాడేందుకు బాండ్ల వివరాలు దాచిపెడుతున్నారని అన్నారు.

ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌బీఐ దిక్కరిస్తోందన్నారు. బిజెపి పార్టీకి వివిధ సంస్థలతోపాటు అనేక మార్గాల్లో వచ్చిన బాండ్ వివరాలు, లెక్కలు తెలియజేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఎస్‌బిఐ బ్యాంక్ ను కోరినా వాటిని దాచిపెడుతున్నారని తెలిపారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ట్రాన్స్‌ఫర్ అవుతున్న లెక్కలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌లో క్లియర్‌గా ఉంటాయని, వాటి వివరాలు ఇవ్వడం కోసం ఎస్‌బీఐ బ్యాంకు నాలుగు నెలల సమయం కోరడం సరైన పద్ధతి కాదన్నారు. సాధారణ ప్రజలు, కార్మికులు, రైతులకు సంబంధించిన వివరాలు మాత్రం వెంటనే వస్తాయని, క్షణాలల్లో వారిపై చర్య దిగుతారని మండిపడ్డారు. కానీ బిజెపి పార్టీకి సంబంధించిన వివరాలు ఇవ్వమని సుప్రీంకోర్టు అడిగినా ఎస్‌బిఐ ఛైర్మెన్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News