Tuesday, May 7, 2024

నియోజకవర్గంలోని ప్రభ్వుత్వ పాఠశాలల అభివృద్ధి : కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి ని యోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, కూకట్‌పల్లి మండలాల పరధిలోని ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, అభివృద్ధి తదతర అంశాలపై మంగళవారం కూకట్‌పల్లి శేషాద్రినగర్‌లోగల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఒ) ఆంజనేయులు పాఠశాలల ప్రదానోపాధ్యాయులతో కలిసి సమీక్షా..సమావేశం నిర్వహించిన కృష్ణారావు పాఠశాలల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం విద్యార్ధులందిరికి కావలసిన పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, బ్యాగులు ఇతర సామాగ్రిని తానే అందిస్తానని కృష్ణరావు తెలిపారు. విద్యార్ధులకు కావలసినమ మౌళిక వసతులు, నియోజకవర్గంలో నూతన పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. కెపిహెచ్‌బి కాలనీలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనులు పూర్తి చేసుకుని విద్యార్ధులకు అంటుబాటులో ఉండగా బాలాజీనగర్‌లో నూతన పాఠశాల ఏర్పాటు పనులు త్వరలేనే పనులు ప్రారంభమవుతాయని కృష్ణారావు తెలిపారు. 2022..23 విద్యా సంవత్సరంలో పదిలో 10/10 సాధించిన ప్రభుత్వ పా ఠశాల విద్యార్ధులకు త్వరలోనే టాబ్లను అందజేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు. అదే విధంగా ప్రైవేట్‌కు ధీటుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలని ఈ సందర్భంగా కృష్ణారావు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News