Sunday, April 28, 2024

ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల వాటాల్లో తెలంగాణ ప్రాంతానికి మోసం జరిగిందని , గత ప్రభుత్వవైఖరి వల్లే నీటి వాటాల్లో నష్టపోయామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడిమా సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చాలా అబద్దాలు మాట్లాడారని తెలిపారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణా నీటిలోఎక్కువ అన్యాయం జరి గిందన్నారు. వీళ్ల పరిపాలన, అసమర్థత వల్లనే కృష్ణ జలాల్లో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన తీసుకున్న వీళ్లు చేసింది తప్పే అన్నారు.చివరిగా వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆన్ రికార్డ్ లో కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి ఒప్పుకొని మెయింటెనెన్స్ కింద 200 కోట్లు కేటాయిస్తున్నట్టుగా పేర్కొన్నారని వెల్లడించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్డుకు ప్రాజెక్టులను ఇవ్వడానికి ఈ 56 రోజుల పాలనలో మేము ఎక్కడ ఒప్పుకోలేదని వివరించారు. 2020 మే5 న ఎపి జివో నెంబర్ 203ను విడుదల చేసిందన్నారు. రోజుకు 8 టిఎంసిల నీటిని తీసునేలా ఆ జివోను ఇచ్చిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎపి, తెలంగాణ సిఎంలను పిలిస్తే వెళ్లలేదన్నారు. ఎపి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టడానికే ఆ మీటింగ్‌కి కెసిఆర్ వెళ్లలేదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 10ఏళ్లలో పూర్తి చేయలేదన్నారు. తెలంగాణలో నీటి కేటాయింపుల్లో మోసం జరిగిందని , కృష్ణాబోర్డుకు ప్రాజెక్ట్‌లు ఇచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న వారే అన్నారు. గ్రావిటీ ద్వారా రావలసిన ఎనిమిది టిఎంసిల కృష్ణా నీటిని కెసిఆర్, జగన్ ఏకాంతంగా మాట్లాడుకుని ఎపికి అప్పగించారని ఆరోపించారు. తమ ప్రభు త్వం కృష్ణాబోర్డుకు ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రాజెక్ట్ లు ఇవ్వడానికి ఒప్పుకోలేదన్నారు. కేంద్రంలో జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి నప్పుడు కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమని ఖరాకండిగా చెప్పామన్నారు. తెలంగాణ వచ్చింది బిఆర్‌ఎస్ వారి వల్ల కాదని, నాటి కేంద్ర మంత్రి చిదంబరం కేంద్రంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒప్పించడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని తెలిపారు. కెసిఆర్ తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఓటింగ్‌డే నాడు ఎపి సిఎం జగన్ తో మాట్లాడి సిఆర్‌పిఎఫ్ బలగాల ను నాగార్జున సాగర్ డ్యాం మీదకు పంపి కుట్ర చేసాడని ఆరోపించారు. ఇదంతా రాజకీయంగా కుట్ర చేయడానికి కెసిఆర్ ఆడిన నాటకం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News