Sunday, September 15, 2024

ఆ విషయంలో బుమ్రాను వ్యతిరేకిస్తా…. ధోనీ అభిమానులకు సారీ: కార్తీక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియాకు ప్రధాన బౌలర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జస్ప్రీత్ బుమ్రా. భారత్ జట్టుకు బౌలింగ్ విభాగంలో వెన్నెముకగా నిలవడంతో పాటు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రా లేకుంటే శ్రీలంక ఆడిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. వికెట్ పడనప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రా వైపు ఆశగా ఎదురుచూస్తాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత జట్టును విజయతీరాలకు బుమ్రా చేర్చాడు. వన్డే ప్రపంచ కప్, టి20 ప్రపంచ కప్‌లో అతడి సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

బుమ్రా కోహీనూర్ వజ్రం కంటే గొప్ప అని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ప్రశంసించాడు. బుమ్రాను భవిష్యత్ కెప్టెన్ అని కొందరు వ్యాఖ్యలు చేయడంతో దినేశ్ మాత్రం వ్యతిరేకించాడు. బుమ్రాకు కెప్టెన్‌గా నియమిస్తే అతడి బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పాడు. బుమ్రా టీమిండియాకు ప్రధాన బౌలర్ కావడంతో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండడంతో చాలా ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందేనని వివరించాడు. అతడి గాయాలు బారిన పడకుండా చూడడంతో పాటు కీలకమైన మ్యాచ్‌ల్లోనే అతడిని బరిలోకి దించాల్సిన అవసరం ఉందని కార్తీక్ సూచనలు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే అతడిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని దినేశ్ కార్తీక్ తెలిపాడు.

ఆల్‌టైమ్ జట్టులో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి దినేశ్ కార్తీక్ చోటు కల్పించకపోవడంతో అతడిపై మహీ అభిమానులు తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ధోనీ అభిమానులకు కార్తీక్ క్షమాపణలు చెప్పాడు. వికెట్ కీపర్ ఎంపిక చేయకపోవడం తన తప్పేనని వివరణ ఇచ్చాడు. ద్రవిడ్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపిక చేసి ఉంటారని చాలా మంది అనుకొన్నారని తెలియజేశాడు. మళ్లీ ఆల్‌టైమ్ జట్టు ప్రకటిస్తే ధోనిని తప్పకుండా ఏడో స్థానంలో ఎంపిక చేస్తానని కార్తీక్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News