Friday, April 26, 2024

అక్కడ తరుగులు.. ఇక్కడ పరుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రౌతుకొద్ది గుర్రం అన్న సామెత అతికినట్టే సరిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దశ దిశలేని వ్యవసాయ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, వాటి అనుబంధ రంగాల పట్ల చిన్నచూపు, దేశ వార్షిక బడ్జెట్‌లో ఈ రంగానికి చేస్తున్న నిధుల కోతలు దేశ వ్యవసాయరంగం వృద్ధి రేటును ఏటేటా దిగజారుస్తున్నాయి. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన నివేదికలే ఇందుకు అద్దం పడుతున్నాయి. మరోవైపు కొత్త రాష్ట్రమే అయినప్పటికీ వ్యవసాయం పట్ల తెలంగాణలో కెసిఆర్ సర్కారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, మనసుపెట్టి రూపొందించిన సంక్షే మ పథకాలు, చిత్తశుద్ధితో వాటిని అమలు చేసిన తీరు, రాష్ట్ర వ్యవసాయ రంగం వృద్ది రేటును పరుగులు తీయిస్తోంది. దేశంలో 130కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతనిచ్చి, వారికి జవసత్వాలు కల్పించే దేశాభ్యున్నతికి ఉపయోగపడే వ్యవసారంగం పట్ల కేంద్రంలోని బిజెపి సర్కారు దృష్టిపెట్టకపోవడంతో దాని ఫలితం ఈ రంగంలో కళ్లకు కడుతున్నది.

దేశంలో 2022 నాటికి వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని స్వయం గా ప్రధాని పదేపదే రైతులకు చేసిన బాసలు ప్రకటనలకే పరిమి తమయ్యాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేస్తామని 2014 నాటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల నినాదంగా నాడు మోడీ బహిరంగ సభల్లో చేసిన బాసలు, అధికారం చేతికందిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో కనీసం ఊసులోకి కూ డా లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో దేశ వ్యవసాయ రంగం నిలువునా ఎండిపోతోంది. దేశంలో 201920 ఆర్థిక సంవత్సరం 6.2శాతంగా ఉన్న వ్యవసాయం వాటి అ నుబంధ రంగాల వృద్ధిరేటు 202223నాటికి 3.3శాతానికి దిగజారి పోయింది. కేంద్ర వ్యవసాయశాఖ నివేదికలే వ్యవసాయ వృద్ధిని గణాంకాలతో బయ ట పెట్టాయి. గత అయిదేళ్లలో వరుసగా 201920లో 6.2శాతం ,202021లో 4.1 శాతం , 202122లో 3.5శాతం, 202223లో 3.3శాతం వృద్ధితో ఏటేటా జాతీయ స్థాయిలో వ్యవసాయం వాటి అనుబంధరంగాల ప్రగతి క్షీణిస్తూ వస్తోంది.

ఇది వచ్చే ఆర్థ్ధిక సంవత్సరంలో మరింతగా క్షీణించనుందని వ్యవసాయ రంగానికి చెందిన నిపుణలు అంచనా వేస్తున్నారు. పిండికొద్ది రొట్టె అన్న రీతి లో కేంద్ర ప్రభుత్వం దేశ వార్షిక బడ్జెట్‌ను 41లక్షల కోట్లనుంచి 45లక్షల కోట్లకు పెంచి, వ్యవసాయశాఖకు కేవలం 1.25లక్షల కోట్లు మా త్రమే కేటాయించింది. 202223తో పోలిస్తే 202324 సంవత్సరానికి అమలు చేయనున్న కేంద్ర బడ్జెట్‌లో మోడీ ప్ర భుత్వం వ్యవసాయ రంగానికి కేటాయింపులు 22శాతం తగ్గించింది. పిఎం కిసాన్ పథకంలోని 11.23కోట్ల రైతుల సంఖ్యను 8.99కోట్లకు కుదించింది. జాతీయ స్థాయిలో పంటల బీమా పథకానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తగ్గించింది. గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయరంగానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ రంగం అభివృద్ధికి ప్రత్యక్ష , పరోక్షంగా ఉపకరిస్తున్న జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం నిధుల కేటాయిపుల్లో రూ.29,400 కోట్లు కోతలువేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయం వా టి అనుబంధ రంగాల్లో కేంద్రంలోని బిజెపి సర్కారు తీరు జాతీయస్థాయిలో రంగం వృద్ధిరేటును ఏటేటా దిగజారుస్తూ పోతోంది.

తెలగాణలో వ్యవసాయ వృద్ది రేటు పరుగులు

తెలంగాణలో కెసిఆర్ సర్కారు వ్యవసాయం వాటి అనుబంధ రం గాల వృద్ధిరేటును పరుగులు పెట్టిస్తోంది. 202223నాటికి ఈ రంగంలో దేశంలోనే 14.05శాతం వార్షిక వృద్ధిరేటు సాధించిన తొలి రాష్టంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా పెరిగింది. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయంతోపాటు వాటి అనుబంధ పట్ల ప్రత్యేక దృష్టితో వివిధ పథకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేయిస్తున్నారు. రైతుబంధు, మిషన్‌కాకతీయ, చేపల పెంపకం, గొర్రెల పంపిణీ వంటి పథకాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయం , ఉద్యానం, పశుసంవర్ధకశాఖ, మత్స శాఖలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఫలితాలకు సామాజిక ఆర్ధిక సర్వే నివేదిక అద్దం పట్టింది. రాష్ట్ర అర్ధిక శాఖమంత్రి హరీష్‌రావు ఇటీవలే అసెంబ్లీ ఆవరణంలో విడుదల చేసిన ఈ సర్వే నివేదిక వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా తెలంగాణ సాధించిన అభివృద్ధిని విశదీకరించింది. 2104-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలు ఉత్పత్తి విలువ రూ.76,123కోట్లకు పరిమితం కాగా ,ఇది 2022-23నాటికి రూ.2,17,877కోట్లకు చేరుకుంది. ఈ రంగంలో వార్షిక గ్రోత్ రేట్ 14.05శాతం సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశ వార్షిక గ్రోత్ రేట్ కంటే ఎంతో ముందుకు దూసుకుపోతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయరంగంపైనే ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1,91, 612కోట్లు ఖర్చు చేసింది. 131.33లక్షల ఎకరాలు ఉన్న సాగు భూముల విస్తీర్ణం ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా నేడు 215.37 లక్షల ఎకరాలుకు చేరుకుంది. రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. 2104లో 68.17 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ఉత్పత్తి 2021-22నాటికి 2కోట్ల 2లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా 2018వానాకాలం నుంచి ఇప్పటివరకూ తొమ్మిది విడుతలలో ఎకరాకు రూ.5000చొప్పున 65,192కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. రైతుబీమా పథకం కింద 2018-నుంచి ఇప్పటివరకూ 95,416 వ్యవసాయ కుటుంబాలకు రూ.4,771కోట్లు అందజేసింది. రాష్ట్రంలో 2601రైతు వేదికలను నిర్మించింది. తెలంగాణ రైతుబంధు సమితి ద్వారా వ్యవసాయ రంగంలో అధునాతన మార్పులు , ప్రభుత్వ పథకాలు , సాగు విధానాల పట్ల రైతులకు అవగాహణ కల్పిస్తోంది.సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2014నాటికి రాష్ట్రంలో 62.48లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వసతి ఉండేది.

మిషన్ కాకతీయతోపాటు కృష్ణా,గోదావరి నదుల పరివాహకంగా పలు సాగునీటి పథకాలు నిర్మించటం ద్వారా నేడు రాష్ట్రంలో 135లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. సాగు నీటిపారుదల అందుబాటులోకి రావటం ద్వారా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ధాన్యం దిగుబడి 2014లో 45.7లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా , 2021-22నాటికి 202 లక్షల మెట్రిక్‌టన్నులకు పెరిగింది. అదే విధంగా పత్తి పంట విస్తీర్ణం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. 18.85లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25.08లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరి 33శాతం వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ వ్యవసాయంలో విత్తన రాజధానిగా అభివృద్ధి చెందింది. ఏటా 5.25 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఇక్కడ ఉత్పత్తి చేసి దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. తాండూరు కందికి ఇటీవలే భౌగోళిక గుర్తింపు లభించింది. ఆయిల్‌పామ్ సాగులో ఇప్పటికే 68,440ఎకరాలతో తెలంగాణ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది.

10.85లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి 

మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచి పింక్ రెవల్యూషన్‌ను సాధించింది. 2014-15లో 5.05లక్షల టన్నులు ఉన్న మాసం ఉత్పత్తి 2021-22నాటికి 10.85లక్షల టన్నులకు చేరింది. మత్ససంపద లో కూడా రాష్ట్రం వేగంగా అభివృద్ది చెందుతూ వస్తోంది. 2021-22లో 3.9లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేసింది.వీటి విలుల రూ.5,860కోట్లుగా రికార్డయింది. వ్యవసాయంతోపాటు వాటి అనుబంధ రంగాలకు 202324 బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు భారీగా పెంచింది. 202324లో వ్యవసాయ రంగానికి రూ.26,831కోట్లు కేటాయించింది. రైతుబంధు పథకానికి రూ.15,570కోట్లు కేటాయించింది. ఈ రంగానికి సంబంధించిన అన్ని విభాగాలకు నిధుల కేటాయింపులను భారీగా పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News