Tuesday, April 30, 2024

ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌పై కేసు కొట్టివేత

- Advertisement -
- Advertisement -

Dismissal of case against MIM MLA Akbaruddin

మనతెలంగాణ/హైదారాబాద్: ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులను కొట్టివేస్తూ ఈ మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాడు తుదితీర్పును వెలువరించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు చూపించలేదన్న కోర్టు కేసులను కొట్టివేస్తూ ఈ కేసులు కొట్టివేసినంత మాత్రాన సంబరాలు వద్దని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని, దేశ సార్వభౌమత్వం దృష్ట్యా వివాదాస్పద వ్యాఖ్యల చేయరాదని అక్బరుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది. నిజామాబాద్ కేసులో 41 మంది , నిర్మల్ కేసులో 33 మంది సాక్షులను విచారించించడంతో పాటు సుదీర్ఘ వాదనల తర్వాత బుధవారం నాంపల్లి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే… 2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో , 2012 డిసెంబర్ 22న నిర్మల్ లో ఎంఐఎం నిర్వహించిన సభలలో అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

“మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యాలు చేశారు. అప్పట్లో పెను దుమారం రేపిన ఈ వ్యాఖ్యలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. నిజామాబాద్, నిర్మల్ సభలలో విద్వేషపూరిత ప్రసంగంపై అక్బరుద్దీన్‌పై నమోదైన కేసులకు సంబంధించి 2013 జనవరి 8న అక్బరుద్దీన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి నిర్మల్‌కు తరలించారు. నిర్మల్ కోర్టులో అక్బరుద్దీన్‌ను హాజరుపరిచారు. ఈకేసులలో అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. ఈక్రమంలో 2013 ఫిబ్రవరి 16న జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

కాగా అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలపై నిజామాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఢిల్లీలో నమోదైన వరుస కేసులను 2013 జనవరి1న అప్పటి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. కాగా నిర్మల్ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం సిఐడి పోలీసులు నిజామాబాద్‌లో 41 మంది , నిర్మల్ కేసులో 33 మంది సాక్షులను విచారించారు. 2016లో సిఐడి , నిర్మల్ పోలీసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఈ కేసులలో ఎ-1గా అక్బరుద్దీన్, ఎ-2 గా యాయా ఖాన్‌ను చేర్చారు. అక్బరుద్దీన్ వీడియో ఫుటేజీలను సిఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించడంతో పాటు ప్రసంగం వీడియోలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కేసుల్లో సుదీర్ఘ విచారణాంతరం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్‌పై నమోదైన కేసులను కొట్టివేస్తూ తుదితీర్పును వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News