Tuesday, April 30, 2024

పెరిగిన బీర్ల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

42 రోజుల్లో 40.46 శాతం అధికం
ఈనెల, వచ్చేనెల మరింత పెరిగే అవకాశం
మార్చి 01 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు
42 రోజుల్లో రూ.3,614.91 కోట్లు విలువైన 5.30 కోట్ల లీటర్ల బీరు విక్రయం

Beer price down by Rs 10 in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో బీర్ల్ల అమ్మకాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. వేసవితాపం అధికమవుతుండడంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. వేసవి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 42 రోజుల్లోనే 40.46 శాతం బీర్లు అధికంగా అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్చి నుంచి ఇప్పటివరకు 42 రోజుల్లో 5.30 కోట్లు లీటర్ల బీరు అమ్ముడు పోగా, 3.59 కోట్లు లీటర్లు లిక్కర్ విక్రయాలు జరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది కంటే 40.46 శాతం అధికంగా బీర్ల విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాల్లో అధికారులు వెల్లడించారు. అయితే రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో బీర్ల అమ్మకాల్లో తగ్గుదల కనిపించగా ప్రస్తుతం కరోనా లేకపోవడం, ఎండలు మరింత పెరగడంతో బీర్ల అమ్మకాలు పెరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల, వచ్చే నెల ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో బీరు అమ్మకాలు మరింత పెరుగుతాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

42 రోజుల్లో రూ.3.59 కోట్ల లీటర్ల లిక్కర్ విక్రయం

Beer-Sales

గతేడాది మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు రూ.3,302.78 కోట్లు విలువైన 3.78 కోట్ల లీటర్ల బీరు, 3.56 కోట్లు లీటర్లు లిక్కర్ విక్రయాలు జరిగాయి. 2022 సంవత్సరం మార్చి 01 వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు 42 రోజుల్లో రూ.3,614.91 కోట్లు విలువైన 5.30 కోట్ల లీటర్లు బీరు, 3.58 కోట్లు లీటర్లు లిక్కర్ అమ్ముడు పోయింది. గతేడాది 2021 మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 11 వరకు జరిగిన బీరు విక్రయాల కంటే 40.46 శాతం అధికంగా (1.53 కోట్ల) లీటర్ల బీరు అధికంగా అమ్ముడుపోయింది. అదే విధంగా 2021 మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు 3.56 కోట్ల లీటర్లు లిక్కర్ విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది అదే 42 రోజుల్లో రూ.3.59 కోట్ల లీటర్ల లిక్కర్ అమ్ముడు పోయింది. దీనిని బట్టి చూస్తే చాలా స్వల్పంగా లిక్కర్ విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి.

పది లక్షల లీటర్ల లిక్కర్….

Beers sales reached the maximum level in the state
Beers sales reached the maximum level in the state

ఏప్రిల్‌లో పగటిపూట ఉష్ట్రోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో బీరు అమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 01వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన బీరు, లిక్కర్ అమ్మకాలను పరిశీలిస్తే 2021 ఏప్రిల్ నెలలో 11 రోజుల్లో 84.64 లక్షల లీటర్ల్ల లిక్కర్‌తో పాటు 1.11 కోట్ల లీటర్ల బీరు అమ్ముడు పోగా, ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 74.94 లక్షల లీటర్ల లిక్కర్ 1.39 కోట్ల లీటర్లు బీరు అమ్ముడు పోయింది. దాదాపు పది లక్షల లీటర్ల లిక్కర్ అమ్మకాలు తగ్గగా, 28 లక్షల లీటర్లు బీరు అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 06వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను చూడగా రోజు వందకోట్లకు తక్కువ లేకుండా మద్యం అమ్ముడవుతుండగా, అందులో రోజుకు 90వేల లీటర్ల వరకు లిక్కర్ అమ్ముడవుతోందని, లక్షా 60వేల లీటర్లు నుంచి లక్షా 80వేల లీటర్ల వరకు బీరు విక్రయాలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News