హైదరాబాద్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సాయం అందిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సివిల్స్ కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని అన్నారు. ప్రజాభవన్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా చెక్కుల పంపిణీ చేశారు. సివిల్స్- 2025 మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ. లక్ష చెక్కుల పంపిణీ అందజేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్- 2024 విజేతలకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీరు ముందుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. విజయవంతంగా రెండో సంవత్సరం ఈ పథకం అమలు చేస్తున్నామని, రూ. లక్ష చెక్కును అభ్యర్థులకు అందిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సివిల్స్ కు సన్నద్ధమయ్యే వారికి సాయం చేస్తాం : భట్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -